ఆత్మకూరు, ఆగస్టు 1 : జలజల జలపాతం నువ్వు.. అన్న చందంగా జూరాల జలాశయం వద్ద జలదృశ్యం ఆవిష్కృతమవుతున్నది. ఆదివారం ఉదయం 4.75 లక్షల క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్‌ఫ్లో రాత్రి 9 గం టలకు 4,27,800 క్యూసెక్కులుగా నమోదైంది. 36 గే ట్లు ఎత్తి 3,63,993 క్యూసెక్కులు విడుదల చేశారు. కో యిల్‌సాగర్ ఎత్తిపోతలకు 315, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు, భీమా లిఫ్ట్-1, 2కు నీటి విడుదల నిలిపేశారు. మొత్తం 3,66,006 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైంది. వి ద్యుదుత్పత్తి నిలిపివేశారు.
సందర్శకుల సందడి..
కృష్ణమ్మ జల సవ్వడిని సందర్శకులు మనసారా ఆ స్వాదిస్తున్నారు. ఆదివారం కావడంతో చిన్నాపెద్ద తేడా లేకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి సరదాగా గడిపారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. నిషేధిత ప్రాంతాలకు వెళ్లకుండా అమరచింత పోలీసులు పహారా నిర్వహించారు.
టీబీ డ్యాంకు వరద..
అయిజ, ఆగస్టు 1 : టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. శివమొగ్గ జిల్లాలోని గాజనూరు వద్ద ఉన్న తుం గ డ్యాం నుంచి 14,818 క్యూసెక్కులు విడుదల చేశా రు. తుంగభద్ర డ్యాంకు 36,215 క్యూసెక్కులుగా ఇ న్‌ఫ్లో నమోదైంది. 20 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 51,066 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 97.200 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఆదివారం ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండ గా, 47,800 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్టలో 11 అడుగుల మేర నీటిమట్టం ఉండగా ప్రధాన కాల్వకు 570 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిలకడగా ప్రవాహం..
శ్రీశైలం, ఆగస్టు 1 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 3,63,993, సుంకేసుల నుంచి 67,734 మొత్తం కలిపి 4,31,727 క్యూసెక్కులు విడుదల చేయగా.. రాత్రి 9 గంటలకు రిజర్వాయర్‌కు 5,03,846 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,72,220 క్యూసెక్కు లు వదిలారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రానికి 30,094, ఎడమగట్టు కేంద్రానికి 31,784 క్యూసెక్కు లు వినియోగించి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. దీంతో 4,34,098 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైం ది. ఏపీ పవర్‌హౌస్‌లో 15.533 మి.యూ, టీఎస్ పవర్‌హౌస్‌లో 15.640 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు.