e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జోగులాంబ(గద్వాల్) అన్ని రంగాల్లో జిల్లాను ముందు ఉంచాలి

అన్ని రంగాల్లో జిల్లాను ముందు ఉంచాలి

  • సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి
  • జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌

నారాయణపేట టౌన్‌, జూలై 19 : సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి లేవనెత్తిన సమస్యలు సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌ అన్నారు. సోమవారం ప ట్టణంలోని శీలాగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌ అ ధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య స మావేశానికి ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. మండలస్థాయిలో జరిగే సమావేశాలకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల సంఖ్య పెంచాలి
జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల సంఖ్యను పెంచుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. యాసంగి సీజన్‌లో అనుకున్న దానికన్నా అధికంగా ధాన్యం ఉత్పత్తి కావడంతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్‌, సివిల్‌ సైప్లె అధికారుల స మన్వయం కొరవడి కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వందశాతం కొనుగోళ్లను పూర్తి చేశారని చెప్పారు. రాబోయే సీజన్‌లో పంట ది గుబడి పెరిగే అవకాశం ఉన్నందున వ్య వసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందు లు లేకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి రూ.55 కోట్లు, అధికారు ల నివాస సముదాయాలకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డీపీఆర్‌ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు, భవనాల కార్యనిర్వాహక ఇంజినీర్‌ను ఆదేశించారు.

- Advertisement -

మరమ్మతులు చేపట్టాలి
జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమతులు చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని, ప్రతి మండలంలో 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునేలా గోదాముల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్‌ భగీరథ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని, లికేజీల వద్ద మరమ్మతులు చేపట్టాలన్నారు.

  • జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలను చదివి వినిపించగా, ప్రజా ప్రతినిధులు తమ ప్రాదేశిక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
  • మద్దూర్‌ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఒకే సంఘం వారు నడుపుతున్నారని, ఆ సంఘం వారు రైతులు కాకుండా వ్యాపారులు లబ్ధిపొందేలా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆరోపించారు.
  • స్త్రీనిధి రుణాలు అర్హులైన అందరికీ అందడం లేదని, సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేయడం లేదని ఊట్కూర్‌ జెడ్పీటీసీ అశోక్‌గౌడ్‌ తెలిపారు.
  • పేట నుంచి మరికల్‌ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోనే మొక్కలు నాటుతున్నారని, దీని వల్ల రాబోయే రోజుల్లో రోడ్ల విస్తరణ చేపడితే చెట్లు తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని కో ఆప్షన్‌ సభ్యుడు చెప్పారు.
  • చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana