e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జోగులాంబ(గద్వాల్) సోలీపూర్‌ ప్రగతి సూపర్‌

సోలీపూర్‌ ప్రగతి సూపర్‌

సోలీపూర్‌ ప్రగతి సూపర్‌
  • రూపురేఖలను మార్చిన పల్లెప్రగతి
  • అభివృద్ధికి కేరాఫ్‌గా..
  • పురోగతిలో 220 ‘డబుల్‌’ ఇండ్లు
  • ఆహ్లాద పర్చుతున్న పల్లెప్రకృతివనం
  • మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో అభివృద్ధి

ఖిల్లాఘణపురం, జూలై 14 : కనీస సౌకర్యాలు కరువైన గ్రామాలకు పల్లెప్రగతి వరంగా మారింది. పల్లెలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ గ్రామాల రూపురేఖలు మార్చేసింది. పల్లెప్రగతితో కొత్త సొబగులు అద్దుకుంటూ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాయి. గతంలో సమస్యలకు నిలయంగా ఉన్న మండలంలోని సోలీపూర్‌ గ్రామం ప్రస్తుతం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గ్రామంలో మొత్తం 698 ఇండ్లు ఉండగా.. అందులో 55 పురాతనం కాగా వాటిని తొలగించారు. మంత్రి ప్రత్యేక చొరవతో గ్రామంలో ఇటీవల ప్రారంభమైన 220 డబుల్‌ బెడ్రూం ఇండ్లు పురోగతిలో ఉన్నాయి.

నర్సరీలో మొక్కల పెంపకం..
పల్లెప్రకృతి వనాన్ని ఆనుకొని నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో టేకు, కానుగ, మలబారువేప, సర్వి, కర్జూర, గోరింట, నిమ్మ, జామ, బకుమియా, రేగి, సిరి వంటి మొక్కలు పెంచుతున్నారు. ఇద్దరు వ్యక్తులు నిత్యం నీళ్లు ప డుతూ సంరక్షణ చర్యలు చేపడుతున్నా రు. పార్కులో నలుగురు వాచర్లను ని యమించారు. గడ్డి మొలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోయడంతో సరిగ్గా అందడం లేదనే ఉద్ధేశంతో బోరు వేసినప్పుడు చెట్లకు నీరు అందేలా పైపులు అమర్చారు.

- Advertisement -

మంత్రి చొరవతో అభివృద్ధి..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లె ప్రగతితో గ్రామంలో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను గుర్తించి అన్ని పనులను చేపట్టాం. మంత్రి సకాలంలో గ్రామానికి కావలసిన పనులను వెంటనే మంజూరు చేయిస్తున్నారు. మంత్రికి కృతజ్ఞతలు.

  • పద్మశ్రీ, సర్పంచ్‌, సోలీపూర్‌

పల్లె ప్రగతి మంచి నిర్ణయం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పల్లె ప్రగతి నిర్ణయం చాలా మంచిది. సెగ్రిగేషన్‌ షెడ్‌ ఏర్పాటు చేశాం. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నాం.చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి నర్సరీలోని మొక్కలకు వాడుతున్నాం. పల్లె ప్రగతితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనం అద్భుతంగా ఉంది.

  • రాఘవేందర్‌, పంచాయతీ కార్యదర్శి

శానా మంచిగైంది..
మా గ్రామంలో రోడ్లు, తాగునీరు, పార్కు, రాత్రి పూట చీకటి లేకుండా లైట్లు బిగించినందుకు శాన మంచిగ కనిపిస్తుంది. ఇలా అయితదని ఎప్పడూ అనుకోలే. పల్లె ప్రగతితో అన్ని పనులు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వల్లే గింత మంచిగా జరిగింది. మును
పెన్నడూ లేని విధంగా మా గ్రామం అన్ని
ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నది.

  • బాలీశ్వర్‌ రెడ్డి, గ్రామస్తుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సోలీపూర్‌ ప్రగతి సూపర్‌
సోలీపూర్‌ ప్రగతి సూపర్‌
సోలీపూర్‌ ప్రగతి సూపర్‌

ట్రెండింగ్‌

Advertisement