e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జోగులాంబ(గద్వాల్) సామాజిక సేవ చేయాలి

సామాజిక సేవ చేయాలి

సామాజిక సేవ చేయాలి
  • ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
  • పేదలకు సేవ చేస్తేనే అల్లా అనుగ్రహం
  • సబీల్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయం
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 14 : సామాజిక సే వలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సబీల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ పేద, యువతీ యు వకులకు కుట్టుమిషన్‌, లాప్‌టాప్‌, దుకాణ సామగ్రి, నూతన దంపతులకు ఫర్నిచర్‌ పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు సేవ చేస్తే అల్లాఅనుగ్రహం ఉంటుందని చెప్పారు. సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకు ఖర్చు చేయాలని సూచించారు. సబీల్‌ ట్రస్‌ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. యువతీయువకులకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందన్నారు. నిరుపేద మైనార్టీ యువతుల వివాహానికి ప్రభుత్వం షాదీముబారక్‌ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.

ట్రస్ట్‌ నిర్వాహకులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన ప్రముఖ ధార్మిక వేత్తలు మహ్మద్‌ జమాలుర్‌ రహెమాన్‌, పీఎం ముంజిమిల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ట్రస్ట్‌ సేవలు అభినందనీయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా సేవ లు అందించాలని సూచించారు. ఆపదలో ఎవరున్నా వారిని ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సబీల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు మౌలానా న యీమ్‌ కౌసర్‌, మౌలానా అమీరుల్లాఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, నాయకులు ఇంతియాజ్‌ ఇ సాక్‌, అబ్దుల్‌ హాది, జాకీర్‌ అడ్వకేట్‌, జాబేర్‌బిన్‌ స యీద్‌, అన్వర్‌పాషా, ఇద్రీస్‌, ముస్తార్‌ రశీద్‌, ఖాజాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సామాజిక సేవ చేయాలి
సామాజిక సేవ చేయాలి
సామాజిక సేవ చేయాలి

ట్రెండింగ్‌

Advertisement