e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జోగులాంబ(గద్వాల్) వలసలకు చరమగీతం

వలసలకు చరమగీతం

వలసలకు చరమగీతం
  • మరో కోనసీమగా పాలమూరు
  • సమైక్య రాష్ట్రంలో వాన నీళ్లు కూడా దక్కలేదు
  • పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరాకూ సాగునీరు
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్

మహబూబ్‌నగర్‌ జూలై 20 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): సమైక్య రాష్ట్రంలో వానలు లేక బోర్లు, బా వులు ఎండిపోయి పంటలు పండక గ్రామాలకు గ్రామా లు ఖాళీ అయ్యేవని… తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో బంగారు పంటలు పండే పరిస్థితి వచ్చిందని ఎక్సైజ్‌, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలమూరు కోనసీమను తలపిస్తుందన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం చిన్నరాజమూరు వద్ద కోయిల్‌సాగర్‌ వాగుపై రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌ డ్యాంను ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రా జేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో బోర్లు, బావు లు ఎండిపోవడంతో పాటు సాగునీటి అవకాశాలే ఉం డేవి కాదన్నారు. వర్షాలు పడి వాగులు వంకలు పొం గితే అవన్నీ కృష్ణానదిలో కలిసిపోయేవి తప్పా రైతులకు ఉపయోగపడే పరిస్థితే లేదన్నారు. మేజర్‌, మైనర్‌ అనే తేడా లేకుండా ఇరిగేషన్‌ వ్యవస్థనే సమైక్య పాలకులు నాశనం చేశారన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ ర న్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి జిల్లాకు సాగునీటి ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నా రు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జి ల్లా సస్యశ్యామలం అవుతదన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతుండగా.. గతంలో నీళ్లు, కరెంటు ఇవ్వ ని వాళ్లు మళ్లీ మోపవుతున్నారని విమర్శించారు. కోయిల్‌సాగర్‌ వాగు, ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యాం ల వల్ల వాగులు సజీవంగా కనిపించే నదుల్లా మారుతున్నాయని..గత పాలకులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాక పూర్వం రైతులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని, ఇప్పుడు రైతు కళ్లల్లో ఆనందం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పంట లు కనపడుతున్నాయని, దారిపొడవునా పచ్చని పొలాలతో మార్కెట్లనిండా ధాన్యం రాసులతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పుడు రైతులు బతకడానికి వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

చెక్‌ డ్యాంలతో భూగర్భ జలాలు పుష్కలం : ఎమ్మెల్యే ఆల
చెక్‌ డ్యాంల నిర్మాణం వల్ల వాగుల సమీపంలోని బోర్లు, బావులు బాగా రీచార్జి అవుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అతి త క్కువ సమయంలో చెక్‌ డ్యాంలను నిర్మించడం ద్వా రా ఇక్కడి రైతులు రెండు పంటలు పండించేందుకు సీ ఎం కేసీఆర్‌ మా వెంట నిలిచారని అందుకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. చెక్‌ డ్యాంల నిర్మాణంతో సుమారు 3 కి.మీ మేర నీళ్లు నిలిచి ఉన్నాయన్నారు. గ తంలో ఆంధ్రోళ్ల కుట్ర వల్ల వర్షపు చినుకు కూడా మన కు ఉపయోపడకుండా తరలించారన్నారు. ఇప్పుడు వ ర్షం ద్వారా కురిసిన ప్రతి నీటి బొట్టునూ రైతులు పం టలు పండించుకునేందుకు ఉపయోగించడమే తమ ధ్యేయమని అన్నారు.

పండుగ వాతావరణం : ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
చెక్‌ డ్యాంల నిర్మాణంతో వాగుల పరిసరాల్లోని గ్రా మాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. గతంలో ఎండిపోయిన వాగు ప్రస్తుతం సజీవంగా మార్చడం ఎంతో గొప్ప విషయమన్నారు. రామన్‌పాడు నుంచి కోయిల్‌సాగర్‌ వరకు వాగుపై అవసరమైనన్ని చెక్‌ డ్యాంలు ని ర్మించి రైతులు రెండు పంటలు పండించుకునేందుకు అ వకాశం కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ము ఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. చిన్నరాజమూరు చెక్‌ డ్యాంకు తామే భూమిపూజ చేసి తామే ప్రారంభోత్సవం చేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, అధికారులు, నాయకులు హాజరయ్యారు.

కులవృత్తులకు ప్రాధాన్యత..
టీఆర్‌ఎస్‌ హయాంలోనే కులవృత్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో 400 ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది ఈత మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ఈత కల్లు వైద్యానికి ఎంతో అవసరమని, నీరగా తయారు చేస్తే కల్లును ఎక్కువ మంది ఇష్టపడతారన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్నట్లు చెప్పారు. హరితహారంలో భాగంగా 3.70 కోట్ల మొక్కలు నాటామన్నారు. చెక్‌డ్యాం నిర్మాణాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరలోనే పూర్తి చేసి కాలువ పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎక్సైజ్‌ ఈఎస్‌ సైదులు, మున్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజ్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, ఎంపీపీ శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కమిషనర్‌ నూరుల్‌నజీబ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, ఎంపీడీవో మున్ని, నాయబ్‌ తాసిల్దార్‌ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, కో ఆప్షన్‌ సభ్యుడు అజీజ్‌, నాయకులు మురళీధర్‌గౌడ్‌, సత్యనారాయణ, అశోక్‌గౌడ్‌, రామురాథోడ్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వలసలకు చరమగీతం
వలసలకు చరమగీతం
వలసలకు చరమగీతం

ట్రెండింగ్‌

Advertisement