e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జోగులాంబ(గద్వాల్) ‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి

‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి

‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి
  • గ్రామాల్లో మంచినీటి ఇబ్బందులు తీర్చాలి
  • కర్ని పెద్ద చెరువును కెనాల్‌ నీటితో నింపడానికి చర్యలు తీసుకోవాలి
  • అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌ రూరల్‌, జూలై 16 : ఈ నెలాఖరు నాటికి పెం డింగ్‌లో ఉన్న మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసి, గ్రామా ల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవా రం పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వనజ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నిలో మిషన్‌ భగీరథ వాటార్‌ ట్యాంక్‌ను ఆగస్టు 1న ప్రారంభించడానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా రు. అలాగే వానకాలం పంటలు వేసుకోవడానికి కర్ని పెద్ద చెరువును సంగంబండ కెనాల్‌ ద్వారా నింపడానికి తక్షణ మే చర్యలు తీసుకోవాలని తాసిల్దార్‌ నర్సింగ్‌రావును ఎమ్మె ల్యే ఆదేశించారు. ప్రస్తుతం కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున గ్రామాల్లో అందరూ వ్యాక్సినేషన్‌ వేసుకోవాలని, అందుకు ఆయా గ్రామాల సర్పంచులు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే వ్యాక్సిన్‌ కొర త లేకుండా వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రజల ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

రైతులకు సేంద్రియ ఎరువులపై అ వగాహన కల్పించాలని, అధిక దిగుబడుల కోసం ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. సమావేశాలకు వ్యవసాయాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కురు స్తున్న వానలకు గ్రామాల్లో విరిగిపడిన కరెంట్‌ స్తంభాలను వెంటనే మార్చాల ని విద్యుత్‌ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. మండలంలో కొత్తగా రుద్ర సముద్రం, మక్తల్‌, భూత్పూర్‌, దాదాన్‌పల్లి నాలుగు సబ్‌ స్టేషన్లు మంజూరు అయ్యాయన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సమవేశంలో ఎంపీడీవో శ్రీధర్‌, తా సిల్దార్‌ నర్సింగ్‌రావు, వైస్‌ ఎంపీపీ సత్యవతి, సీడీపీవో సరోజిని, ఎంఈవో లక్ష్మీనారాయణ, విద్యుత్‌ ఏఈ విజయ్‌, పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్‌, పంచాయతీరాజ్‌, ఈజీఎస్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎంపీడీవోకు ఘన సన్మానం…
ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎంపీడీవో రాజేందర్‌గౌడ్‌ దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అ లాగే ఎంపీపీ వనజ, కార్యాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజేందర్‌గౌడ్‌ ఎక్కడ పని చేసినా విధి నిర్వహణను అంకితభావంతో నిర్వహించారన్నారు. ఆయన శే ష జీవితం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడుపాలని ఆకాంక్షించారు. అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి
‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి
‘మిషన్‌ భగీరథ’ పనులు త్వరగా పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement