e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రైవేట్‌కు దీటుగా బాలానగర్‌ పీహెచ్‌సీ

ప్రైవేట్‌కు దీటుగా బాలానగర్‌ పీహెచ్‌సీ

  • మెరుగైన వైద్య సేవలకు కేరాఫ్‌
  • దూర ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణులు
  • పెరుగుతున్న ప్రసవాల సంఖ్య
  • దవాఖానల్లో సకల సౌకర్యాలు

బాలానగర్‌, అక్టోబర్‌ 19 : మండలకేంద్రంలోని దవాఖాన (పీహెచ్‌సీ)లో రోజు రోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. వైద్యులు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మండలానికి చెందిన వారితోపాటు చుట్టుపక్కల గ్రామాల గర్భిణులు ఇక్కడి దవాఖానలో ప్రసవం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈఏడాది ఇప్పటి వరకు 48 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దవాఖానలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేశారు. దవాఖానలో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం తరఫు న కేసీఆర్‌ కిట్‌తోపాటు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నా రు. ఆపరేషన్‌ అయిన ఏడు రోజుల వరకు ప్రతి రోజు డాక్ట ర్ల పర్యవేక్షణలో బాలింతలు ఉంటున్నారు. నిత్యం బాలింతలతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యులపై మంచి నమ్మకం ఏర్పడిందనడానికి బాలానగర్‌ ప్రభుత్వ దవాఖాన నిదర్శనంగా నిలుస్తున్నది. డిశ్చార్జి బాలింతలను అమ్మ ఒడి వాహనంలో ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ఆయూష్‌ విభాగంలో అయుర్వేద, యూనానీ విభాగంలో ఒక్కో డాక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు.

అత్యవసర కేసులు వస్తే జిల్లా కేంద్రానికి..
దవాఖానకు అత్యవసర కేసులు వస్తే మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రెఫర్‌ చేస్తున్నారు. దవాఖానలోనే అంబులెన్స్‌ అం దుబాటులో ఉండడంతో అత్యవసర వైద్యం అవసరమున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదు.

- Advertisement -

సాధారణ ప్రసవాలు చేసేందుకు కృషి
పీహెచ్‌సీలో అందరికీ మెరుగైన వైద్య సే వలు అందిస్తున్నాం. వైద్య సేవలు అవసరమైన ప్రతి ఒక్కరూ ప్రైవేట్‌ దవాఖాన కు వెళ్లకుండా ప్రభుత్వ ద వాఖానకు వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసేందుకు కృ షి చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యంపై క్షేత్రస్థాయిలో ప్రజల కు అవగాహన కల్పించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు, ఆపరేషన్లు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.

  • డాక్టర్‌ తులసి మెడికల్‌ ఆఫీసర్‌,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాలానగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement