e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • పాడుబడిన ఇండ్లల్లో ఉండొద్దు
  • ఉధృతంగా పారే వాగులతో ప్రమాదాలు జరగకుండా చర్యలు
  • ఎస్పీ వెంకటేశ్వర్లు

గండీడ్‌, జూలై 23 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం గండీడ్‌ మండలంలోని పగిడ్యాల్‌, సల్కర్‌పేట్‌, రంగారెడ్డిపల్లి వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో ఎవరూ నివాసం ఉండొద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులతో ప్ర మాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. వర్షాలు భారీగా కురిస్తే రంగారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రమాదాలను పసిగట్టేందుకు ఒక కానిస్టేబుల్‌ను అక్కడ ఉంచాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. త్వరలోనే గండీడ్‌లో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కానుందని, ఇందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని తెలిపారు. అంతకుముందు సల్కర్‌పేట్‌ గ్రా మస్తులకు పలు సూచనలు చేశారు. మొహర్రం సందర్భంగా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా సామరస్యంగా పండుగ జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేశ్వర్‌రావు, ఎస్సైలు సతీశ్‌, మాధవి రాముడు పాల్గొన్నారు.

గొండ్యాల వాగు పరిశీలన
మండలంలోని గొండ్యాల వాగు ను ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. వాగు పరీవాహక గ్రామాల వివరాలను ఎస్సై సతీశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వెం టనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాగు లు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట సీఐ ఉమామహేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana