e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021

ప్రగతి జోరు

ప్రగతి జోరు
  • అభివృద్ధి పథంలో హన్వాడ
  • రూ.6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
  • రూ.కోటి 25లక్షలతో మార్కెట్‌ యార్డు
  • వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ

హన్వాడ, జూలై 19 : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్వాడ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సుమారు రూ.6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఏ వార్డుకు వెళ్లినా సమస్యలే కనిపించేవి. నేడు గ్రామంలో ఎక్కడా సమస్యలు లేవు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చొరవతో గ్రామంలో చాలా సమస్యలు పరిష్కరించారు. 681 మందికి ప్రతి నెలా రూ.15,25,456 పింఛన్‌ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.

పరిశుభ్రత, హరితహారంపై దృష్టి..
గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి వార్డు వార్డుకు తిరిగి ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. 15 రోజులకోసారి పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. నెలకు రెండుసార్లు వాటర్‌ ట్యాంకులను క్లీన్‌ చేయిస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఆయా వార్డుల్లో సీసీరోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేశారు. మూడు రోజులకోసారి గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ ద్వారా మొక్కలకు నీళ్లు పడుతున్నారు. నాటిన మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటుతున్నారు. గ్రామంలో సుమారుగా 40 వేల మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించేందుకు కూలీలను నియమించారు.

- Advertisement -

గ్రామంలో చేపట్టిన ప్రగతి..

  • రూ.66 లక్షలతో 12 సీసీ రోడ్ల ఏర్పాటు
  • రూ.12 లక్షలతో ఎనిమిది డ్రైనేజీల నిర్మాణం.
  • రూ.22 లక్షలతో రైతువేదిక భవనం నిర్మాణం.
  • రూ.12.50 లక్షలతో శ్మశానవాటిక ఏర్పాటు.
  • రూ.2.40 లక్షలతో డంపింగ్‌ యార్డు.
  • రూ.3.50 లక్షలతో పల్లెప్రకృతి వనం.
  • రూ.7 లక్షలతో ప్రధాన రహదారికి ఇరువైపులా వీధి దీపాల ఏర్పాటు.
  • రూ.20 లక్షలతో జెడ్పీహెచ్‌ఎస్‌ కంపౌండ్‌ వాల్‌ నిర్మాణం.
  • రూ.3 లక్షలతో యాదవ కమ్యూనిటీ హాల్‌ భవనం.
  • రూ.1.20 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రాలకు కంపౌండ్‌ వాల్‌ నిర్మాణం.
  • రూ.5 లక్షలతో గౌడ సంఘం భవనం.
  • గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.కోటి 60 లక్షలతో గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇస్తున్నారు.
  • సుమారుగా 40 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

జరుగుతున్న పనులు..

  • రూ.45 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం.
  • రూ.60 లక్షలతో మార్కెట్‌ యార్డు.
  • రూ.1.25 కోట్లతో మటన్‌ మార్కెట్‌ యార్డు.
  • రూ.25 లక్షలతో ఓపెన్‌ జిమ్‌.
  • రూ.10 లక్షలతో నాయీబ్రాహ్మణ సంఘం భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతి జోరు
ప్రగతి జోరు
ప్రగతి జోరు

ట్రెండింగ్‌

Advertisement