e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలి

ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలి

మహబూబ్‌నగర్‌టౌన్‌, జూలై 23 : బృహత్‌ ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్‌ ప్రకృతి వనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం బృహత్‌ ప్రకృతివనంలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. అలాగే వీరన్నపేట నుంచి డబుల్‌బెడ్రూం ఇండ్ల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, మెప్మా పీడీ శంకరాచారి, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పనుల్లో వేగం పెంచాలి
బృహత్‌ ప్రకృతి వనం నిర్మాణ ప నులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని మాదారంలో బృహత్‌ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.40లక్షలతో నిర్మిస్తున్న ప్రకృతివనంలో అన్నిరకాల మొక్కలు పెంచి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, తాసిల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్‌, ఈవోపీఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఏపీవో హైమావతి, సర్పంచ్‌ ర్యాకమయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు రమణరెడ్డి, రామలింగం, బాలకిష్టయ్య, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

భవానీసాగర్‌ అద్భుతం
మండలంలోని జై భవానీసాగర్‌ ప్రకృతి అందాలు అద్భుతమని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం భవానీసాగర్‌ను పరిశీలించారు. వర్షాలకు భవానీసాగర్‌ అలుగు పారడం, అటవీ సంపద ఆహ్లాదకరంగా ఉన్నాయని అన్నారు. పర్యాటక కేంద్రంగా భవానీసాగర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్‌ వెంట జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana