e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జోగులాంబ(గద్వాల్) పొంగిపొర్లె..

పొంగిపొర్లె..

పొంగిపొర్లె..
  • విస్తారంగా వర్షాలు
  • నిండు కుండల్లా చెరువులు
  • అలుగు దుంకుతున్న కుంటలు
  • జలకళ సంతరించుకున్న వైనం

ఊట్కూర్‌, జూలై 18 : బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయిదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఊట్కూర్‌ మండలంలో జలకళ సంతరించుకున్నది. వర్షాలకు చెరువులు, కుంటలు, వంకలు, వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళతో తొణికిసలాడుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. స్థానిక పెద్ద చెరువుకు పైపాటు నుంచి భారీగా వర ద చేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. మండలంలోని ఓబ్లాపూర్‌, లక్ష్మీపల్లి, పులిమామిడి, వల్లంపల్లి, కొత్తపల్లి, అవుసలోనిపల్లి, నిడుగుర్తి, పగిడిమర్రి, బిజ్వారం తదితర గ్రామాల్లో చెరువులు, వంకలు, కుంటలకు భారీగా వర ద నీరు చేరి మూడు రోజులుగా అలుగులు పారుతున్నా యి. చిన్నపొర్ల, పెద్దపొర్ల, తిప్రాస్‌పల్లి, మొగ్దుంపూర్‌, ఎడవెల్లి గ్రామాల్లో చెరవులకు 90 శాతానికి పైగా నీరు చేరడం తో నిండుకుండను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో చె రువులు, కుంటలు కలకళను సంతరించుకోవడంతో చూ సేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పలు గ్రామాల్లో వరద నీటికి చేపలు ఎదురెక్కడంతో యువకులు వేట కొనసాగిస్తున్నారు. అలాగే భారీ వర్షాకి మండలంలో 190 ఎరాల్లోకి పత్తి పంట కోతకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.

అలుగు పారిన కర్ని పెద్ద చెరువు
మక్తల్‌ రూరల్‌, జూలై 18 : మండలంలోని కర్ని పెద్ద చెరువు ఆదివారం పూర్తిస్థాయిలో నిండి అలుగుపారింది. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కర్ని పెద్ద చెరువుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. దీంతో సకాలం లో చెరువుకు నీళ్లు వచ్చి అలుగు పారడంపై ఆయకట్టు రై తులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు కింద ఆయకట్టు రైతు లు వరి పంటలను సాగు చేస్తున్నారు. దాదాపు 600 ఎకరాల భూములు సాగవుతున్నాయి. చెరువుపై భాగంలో సంగంబండ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ గ్రావెటీ కెనాల్‌ ఏర్పాటు చేయడం వల్ల వర్షాలకు వచ్చే వరద కాల్వల ద్వా రా వెళ్లిపోతున్నది.

- Advertisement -

కాగా ఈసారి వరుణ దేవుడు కనికరించి ముందుగా భా రీ వర్షాలు కురువడం వల్ల చెరువు పూర్తిస్థాయిలో నిండడం వల్ల రైతులకు వానకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో చెరువు కింద ఆయకుట్టు రైతులు వరినాట్లు వేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. కాగా అలుగు నీటి ఉధృతి వల్ల రోడ్డుపైకి వచ్చి ప్రవహించడంతో కర్ని నుంచి మక్తల్‌కు వెళ్లడానికి రా కపోకలు స్తంభించిపోయాయి. దీంతో వివిధ గ్రామాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పొంగిపొర్లె..
పొంగిపొర్లె..
పొంగిపొర్లె..

ట్రెండింగ్‌

Advertisement