e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జోగులాంబ(గద్వాల్) పల్లెల్లోనూ పద్ధతిగా..!

పల్లెల్లోనూ పద్ధతిగా..!

  • గ్రామాల్లోనూ బీ పాస్‌ అమలు
  • టీఎస్‌-బీపాస్‌తో డీపీఎంఎస్‌, ఈ పంచాయతీల అనుసంధానం
  • లే అవుట్లకు కలెక్టర్‌ అనుమతి
  • పంచాయతీ అనుమతితోనే నిర్మాణాలు

నాగర్‌కర్నూల్‌, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అక్రమ నిర్మాణాలపై పంచాయతీరాజ్‌ శాఖ ఉక్కుపాదం మోపనున్నది. టీఎస్‌ బీపాస్‌లో భాగంగా ఇప్పటికే పురపాలికల్లో అనుమతులు లేని ఇండ్లు, భవన నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నా రు. ఇదే క్రమంలో పంచాయతీల్లోనూ బీ పాస్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే ఉత్తర్వులు జారీ కావడంతో త్వరలో అమలయ్యే ఈ చట్టంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవడంతోపాటు అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించనున్నారు.
గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలకు కాలం చెల్లనున్న ది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి పంచాయతీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్‌ బీపాస్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సరైన ధ్రువీకరణతో కేవలం 21 రోజుల్లోనే ఇండ్లు, భవన నిర్మాణాలను చేపట్టొచ్చు. ఇందుకు యజమానులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

కాగా, చాలా చోట్ల ఈ నిబంధనలను యజమానులు అమలు చేయడం లేదు. పెద్ద ఎత్తున భవనాలను స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన వివరాలకు భిన్నంగా అక్ర మ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో, బఫర్‌ జోన్‌, నాలాల పక్కన, రోడ్లను ఆక్రమించి, నిషేధిత స్థలాల్లో భవనాలు కడుతున్నారు. ఈ నిర్మాణాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పులుగా మారాయి. తరచూ వివాదాలుగా మారుతున్నా యి. కొందరు యజమానులు రాజకీయ పలుకుబడితో అధికారులను ప్రభావితం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మాదిరిగా అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు కానున్నాయి. అక్రమ ఇండ్ల నిర్మాణాలను కూల్చివేయించే అధికారం ఈ బృందానికి ఉంటుంది. ఫిర్యాదులపై విచారణ చేసి, అ క్రమ నిర్మాణమని తేలితే మూడు రోజుల్లోనే ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేస్తారు.

- Advertisement -

కాగా, అంతకుముందు పంచనామా నిర్వహించి రికార్డు నమోదు చేపడుతారు. కూల్చివేతకు అవసరమయ్యే వ్యయాన్ని సైతం యజమాని నుంచే వసూలు చేయనుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఇ లాంటి అక్రమ భవనాల నిర్మాణం నిర్వహిస్తే కూల్చివేతతోపాటు స్థలం విలువలో 25 శాతం జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. వ్యవసాయం, ఇతర ఉపాధి అవకాశాలతో గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం కూడా పెరుగుతున్నది. అలాగే హైదరాబాద్‌తోపాటు సమీప పట్టణాల్లో నివాసముండే గ్రామీణులు సై తం పల్లెల్లో కొత్తగా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక రియల్టర్లు మున్సిపాలిటీల శివారు గ్రామాల్లోనూ నూతనంగా వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా, నిర్మాణదారులు అనుమతుల్లో చూపించిన విస్తీర్ణం కంటే అదనంగా ఇండ్లు, భవనాలు ని ర్మిస్తున్నారు.

దీంతో పంచాయతీలకు సరైన ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీల నియామకంతో అక్రమ నిర్మాణాలు ఆగిపోవడంతోపాటు పంచాయతీలకు ఆదా యం సమకూరనున్నది. కాగా గ్రామాల్లో ఇప్పటికే చేపట్టిన అక్ర మ లే అవుట్లకు అనుమతులు తీసుకునేందుకు ప్రభుత్వం రెండు నెలల గడువు ఇచ్చింది. ఈ లే అవుట్లను కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లే అవుట్‌ కమిటీ ముందు ఉంచుతారు. ఈ కమిటీ సిఫార్సు ల మేరకు సంబంధిత పంచాయతీల కార్యదర్శుల పేరు మీద అనుమతులు మంజూరవుతాయి. ఈ ప్రక్రియ అమలులో అధికారుల నిర్లక్ష్యంపై కూడా జరిమానాలతో ప్రభుత్వం కార్యాచరణ నిర్దేశించింది. ప్రస్తుతం పంచాయతీల్లో లే అవుట్ల అనుమతులకు అమ లు చేస్తున్న డీపీఎంఎస్‌, ఈ పంచాయతీ విధానాలు టీఎస్‌-బీపాస్‌తో అనుసంధానమవుతాయి. ఆ వెంటనే గ్రామాల్లో బీ-పాస్‌ విధానం అమలవుతుంది. దీనివల్ల గ్రామాలకు ఆదాయం సమకూరడంతోపాటు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుంది.

85 అక్రమ లే అవుట్లు గుర్తించాం..
గ్రామ పంచాయతీల్లో బీ-పాస్‌ అమలు పై ఈనెల 8న ఉత్తర్వులు వచ్చాయి. జిల్లా లో 85 అక్రమ లే అవుట్లు ఉన్నట్లుగా ప్రా థమికంగా గుర్తించాం. ఈ లే అవుట్లకు రెం డు నెలల్లో అనుమతులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇండ్లకు సైతం ఆన్‌లైన్‌లోనే ప్రజ లు అనుమతులు తీసుకోవాలి. త్వరలో ఈ పంచాయతీ పోర్టల్‌ బీ-పాస్‌లో అనుసంధానమైన వెంటనే జిల్లాలో అమలు చేస్తాం. – రాజేశ్వరి, డీపీవో, నాగర్‌కర్నూల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana