e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జోగులాంబ(గద్వాల్) పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌టౌన్‌, జూలై14: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవర్‌ అన్నారు. తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్‌చౌరస్తా, క్లాక్‌టవర్‌ జంక్షన్లు, డ్రైనేజీ పనులను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించడకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు ప్రతి రోజూ ఫీల్డ్‌ విజిట్‌ చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ అన్నారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఆయన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్డు పనులను పరిశీలించారు. గ్రామంలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఏపీవో జ్యోతి, సర్పంచ్‌ యాదయ్య, ఎంపీటీసీ లక్ష్మీబాయి, నాయకులు అబ్దుల్లా, నవనీతరావు, ఆనంద్‌, జైపాల్‌యాదవ్‌, ఈసీ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులు త్వరగా పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement