e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జోగులాంబ(గద్వాల్) నిండిన చెరువులు.. పొంగిన వాగులు

నిండిన చెరువులు.. పొంగిన వాగులు

నిండిన చెరువులు.. పొంగిన వాగులు
  • ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
  • ధన్వాడ, మక్తల్‌ మండలాల్లో ఇండ్లలోకి చేరిన వర్షపునీరు
    మరికల్‌ పెద్ద చెరువుకు గండి
  • మత్తడి దుంకిన చెరువులు

ధన్వాడ/మక్తల్‌ టౌన్‌/మరికల్‌/కోస్గి/దేవరకద్ర రూరల్‌, జూలై 16 : నారాయణపేట జి ల్లా భారీ వర్షానికి తడిసి ముద్దయింది. గురువారం రాత్రి మక్త ల్‌, ధన్వాడ, మరికల్‌ మండలా ల్లో వాన పడింది. దీంతో ధన్వా డ మండలం మందిపల్లిపాత తండాలో ఇండ్లలోకి నీరు చేరిం ది. దీంతో స్థానికులు ఇబ్బందు లు పడ్డారు. తండా సమీపంలో నే కోయిల్‌సాగర్‌ కాల్వ ఉండటంతో వర్షపు నీరు అక్కడి నుంచి నిల్వతో ఇండ్లలోకి నీరు చేరిందని వాపోయారు. అలాగే మక్తల్‌ మున్సిపాలిటీలోని 7వ వార్డు పరిధిలోని శ్రీరాంనగర్‌, అయ్యప్ప కాలనీల్లోని ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిని జేసీబీ సాయంతో కా ల్వలు ఏర్పాటు చేసి మళ్లీంచారు. శుక్రవారం మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌ లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. కోస్గి మండలం కడంపల్లి వాగువద్ద రోడ్డుకట్ట తెగిపోవడంతో హన్మాన్‌పల్లి కడంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. కోస్గి 6వ వార్డులో ఎర్రకుంట నీరు ఇండ్ల మధ్యలోకి చేరింది. మరికల్‌ పెద్ద చెరువుకు భారీగా వర్షపు నీ రు రావడంతో కట్టకు గండి పడింది. ఈ నీరంతా అంతర్రాష్ట్ర రహదారిపైకి చేరడంతో రోడ్డు జలమయమైంది. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులకు సర్పంచ్‌ గోవర్ధన్‌ సమాచారం అం దించడంతో స్పందించిన అధికారులు, కాంట్రాక్టర్‌ గండి పూడ్చారు.

ఉధృతంగా మన్నెవాగు..
మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిన్నచింతకుంట మండ లం కురుమూర్తి, లాల్‌కోట, చెక్‌ డ్యాంలతో పా టు, బండర్‌పల్లి గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగుపై ఉన్న చెక్‌డ్యాం మత్తడి పోస్తున్నది. ఏదులాపూర్‌, చిన్న వడ్డెమాన్‌ గ్రామాల మధ్య ఉన్న మన్నెవాగు ఉధృతంగా పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చర్యలు చేపట్టారు. కౌకుంట్ల అమ్మల చెరువు, తుమ్మల చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. రేకులంపల్లి, చిన్న రాజమూరు, పల్లమర్రి, పేరూర్‌, బస్వాపూ ర్‌, పెద్ద రాజమూరు గ్రామాల సమీపంలోని చెక్‌ డ్యాంలు నిండి అలుగు పారుతున్నాయి. అధికారులు నిండిన చెరువుల వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిండిన చెరువులు.. పొంగిన వాగులు
నిండిన చెరువులు.. పొంగిన వాగులు
నిండిన చెరువులు.. పొంగిన వాగులు

ట్రెండింగ్‌

Advertisement