e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జోగులాంబ(గద్వాల్) జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
  • 724.4మి.మీ వర్షపాతం నమోదు
  • నిండిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు

ఊట్కూర్‌, జూలై 19 : జిల్లాలో ఆదివారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు దంచికొట్టిం ది. వానధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చే రింది. దీంతో తీవ్ర ఇక్కట్లు ఏర్పడాయి. భారీ వర్షానికి ఊట్కూ రు మండలంలోని మల్లేపల్లి, పులిమామిడి, చిన్నపొర్ల, పెద్దపొర్ల తదితర గ్రామాల్లో పెద్ద చెరువులు అర్ధరాత్రి నుంచి అలుగులు పారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. జిల్లా వ్యాప్తం గా ఆదివారం 724.4మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. అత్యధికంగా మ రికల్‌ మండలంలో 70.5మి.మీ వర్షపాతం నమోదు కాగా ధ న్వాడలో 70.0మి.మీ, మక్తల్‌ మండలంలో 60.0 మి.మీ, మా గనూర్‌ మండలంలో 52.2మి.మీ, కృష్ణ మండలంలో 49.0మి .మీ, ఊట్కూర్‌ మండలంలో 31.4మి.మీ, దామరగిద్ద మండలంలో 25.4మి.మీ, మద్దూర్‌ మండలంలో 24. 0మి.మీ, నా రాయణపేట మండలంలో 21.2మి.మీ, నర్వ మండలంలో 13.4మి.మీ, కోస్గి మండలంలో 7.3మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కురువడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంట లు, వాగులు, వంకలు, చెక్‌ డ్యాంలకు జలకళ సంతరించుకుంటున్నాయి. వారం రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురువడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఈ వర్షాలు పంటలకు జీవం పోస్తున్నాయి.
కురుస్తున్న వర్షాలు
మరికల్‌, జూలై 19 : వారం రోజులుగా కురుస్తున్న వానల కు మండలంలోని కన్మనూర్‌, మరికల్‌ తదితర గ్రామాల్లో పం టలు పూర్తిగా నీట మునిగాయి. కన్మనూర్‌ శివారులో అధిక మొ త్తంలో పంటలు నీట మునిగాయి. అలాగే కన్మనూర్‌, మరికల్‌ పెద్ద చెరువు మత్తడి పోయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు మునిగిన రైతులను అదుకోవాలని కోరుతున్నారు. కన్మనూర్‌ వాగు రోడ్డుపై నుంచి ప్రవహించడం రెండో సారి కావడం విశేషం.
పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు
మక్తల్‌ రూరల్‌, జూలై 19 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి అలుగు పారాయి. కాగా భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లో చెరువులు నిండి అలుగు పారడంతో ప్రవాహానికి బ్రిడ్జీలు, వంతెనలపై వరద నీరు ప్రవహిస్తున్నది. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. మండలంలో 60.0మి.మీ వర్షపాతం న మోదైనట్లు తాసిల్దార్‌ నరసింగ్‌రావు సోమవారం తెలిపారు. కాగా మంథన్‌గోడ్‌ చెరువు ఎట్టకేలకు అలుగు పారింది. అలాగే సోమవారం రుద్రసముద్రం, ఖానాపూర్‌, చిట్యాల, భూత్పూర్‌, కాచ్‌వార్‌ చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పారాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
కురిసన వర్షాలకు పలు చెరువులు, కుంటలు నిండడంతో ఆ యా గ్రామాల్లో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్నది. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలకు ఆర్టీసీ బ స్సులను రద్దు చేశారు. కర్ని పెద్ద చె రువు వరదనీరు బ్రిడ్జిపై నుంచి ప్ర వాహిస్తుండడంతో కర్ని, చిట్యాల, పస్పుల, పంచదేవ్‌పాహాడ్‌, ముస్లాయ పల్లి, పారేవుల, అనుగొండ, దాదాన్‌పల్లి, ముస్టిపల్లి, సత్యవార్‌, కల్వాల్‌, పంచలింగాల, భగవాన్‌పల్లి తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రెండు రోజులుగా జనజీవనం స్తంభించిపోవడంతో నిత్యావసరసరకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా వరద ప్రవాహానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసులు పర్యవేక్షించారు. మంథన్‌గోడ్‌ వద్ద బ్రిడ్జి పై వరదనీటి ప్రవాహం పెరుగడంతో పోలీసులు నిఘా పెట్టారు.
నీట మునిగిన పంటలు
కురుస్తున్న వర్షాల వల్ల మంథన్‌గోడ్‌, రుద్రసముద్రం, దం డు, కాట్రేవ్‌పల్లి గ్రామాల్లో పత్తి పంట నీట మునిగింది. దాదాపు 100 ఎకరాలకు పైగా పత్తి పంట నీళ్లలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంథన్‌గోడ్‌ పెద్ద చెరువు అలుగు ప్రవాహానికి దాదాపు 50 ఎకరాల పత్తి పంట దెబ్బ తిన్నదన్నారు. పంటలు నీటిలో మునిగిపోవడంతో మొక్కలు ఎర్రగా మారాయని పలువురు రైతులు తెలిపారు. అలాగే రుద్రసముద్రం, దండు శివారుల్లో సుమారు 60 ఎకరాలు పత్తి, కంది పంటలు నష్టం వాటిల్లినట్లు ఆయా గ్రామాల రైతులు చెప్పారు.
నీళ్లు వదిలిన అధికారులు
ధన్వాడ, జూలై 19 : మండల పెద్ద చెరువు కింద ఉన్న ఆయకట్టుకు సోమవారం అధికారులు నీళ్లు వదిలారు. కురుస్తున్న వ ర్షాలకు పెద్ద చెరువు నిండి అలుగు పారుతున్నది. దీంతో రైతు లు, అధికారులు గుర్తించి తూము ద్వారా పొలాలకు నీళ్లు వదిలారు. అంతకుముందు తూము వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు అలుగు పారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్‌, కందూర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ముసిరిగారి నర్సింహులు, బాలప్ప, ఆనంద్‌, ఆశోక్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement