e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జోగులాంబ(గద్వాల్) చిన్నారుల జీవితాల్లో స్మైల్‌

చిన్నారుల జీవితాల్లో స్మైల్‌

చిన్నారుల జీవితాల్లో స్మైల్‌
  • ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో తనిఖీలు
  • వెట్టి నుంచి బాలకార్మికుల చేరదీత
  • చేయూతనిస్తున్న పోలీస్‌ శాఖ
  • మహబూబ్‌నగర్‌లో 94, పేటలో 40 మంది గుర్తింపు

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ, జూలై 22 : బ డిలో అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు బాలకార్మికులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులతో పలుగు, పార పడుతున్నారు. చా లా మంది బాలబాలికలు ఇటుక బట్టీలు, పరిశ్రమలు, హోటళ్లలో పనిచేస్తున్నారు. పశువులు, గొర్రెల కాపరులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇం దుకు ప్రధాన కారణం పేదరికం అని చెప్పొచ్చు. అలాంటి వారందరిని చేరదీసి పాఠశాలల్లో చేర్పించేందుకు పోలీసు శాఖ ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట తనిఖీలు నిర్వహిస్తున్నది. తనిఖీలు చేపట్టేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేశారు. పోలీ సు శాఖతోపాటు లేబర్‌ అధికారి, చైల్డ్‌ వెల్ఫేర్‌ సి బ్బంది ఇందులో సభ్యులుగా ఉంటారు. వా రిలో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి, కార్మిక శాఖ అధికారి ఉంటారు. ఈ బృందాలు నిరంతరం ఇటుక బట్టీలు, హోటళ్లు, వ్యవసాయ పొలాలను తనిఖీ చేసి, బడిబయటి పిల్లలను చేరదీస్తారు.

14 ఏండ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానిపై బాలకార్మిక చ ట్టం కింద కేసు నమోదు చేస్తారు. 18 ఏండ్లలో పు వారు ఉంటే వారిని బాలల సంరక్షణ కేం ద్రం(సీడబ్ల్యూసీ)కు తరలించి కౌన్సెలింగ్‌ ఇస్తా రు. అబ్బాయిలను మహబూబ్‌నగర్‌ పట్టణంలో ని ఆర్‌బీసీ కేంద్రానికి, అమ్మాయిలను స్కూళ్లలో చేర్పిస్తామని హామీ ఇస్తే తల్లిదండ్రుల వెంట పం పుతారు. లేకుంటే స్టేట్‌హోంకు తరలిస్తారు.

- Advertisement -

మిశ్రమ ఫలితాలు..
ఆపరేషన్‌ ముస్కాన్‌ మిశ్రమ ఫలితాలు ఇస్తున్నది. తల్లిదండ్రుల వెంట పంపించిన పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. 14 నుంచి 18 ఏండ్లలో పు పిల్లలను బడిలో చేర్పిస్తే.. బడిలో ఇమడలేకపోవడం లేదా ఆ వయస్సులో సరిగ్గా చదువకపోవడం వంటి కారణాలతో మళ్లీ పనిలో చేరుతున్నారు. కొందరు మాత్రం చక్కగానే చదువుతున్నారు. అయితే, బాలకార్మికులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేయడం తో పెద్ద పిల్లలు తిరిగి పనిలోకి వెళ్తున్నా.. ఇంట్లో ఉండే మిగతా చిన్నారులు మాత్రం బడిలో చే ర్పిస్తున్నారని తెలుస్తున్నది. యాచక వృత్తిలో ఉన్న చిన్నారులను మాత్రం దాదాపుగా మళ్లీ అదే వృత్తిలోకి వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, చిన్నారులపై ని రంతరం నజర్‌ పెడితే డ్రాపౌట్‌లను చాలా వరకు తగ్గించే అవకాశం ఉన్నది. కానీ అంతమంది సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రా వడం లేదని తెలుస్తున్నది.

చిన్నారులను పనిలో పెట్టుకుంటే కేసు
14 ఏండ్ల లోపు ఉన్న చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్‌ ము స్కాన్‌, స్మైల్‌ను జిల్లాలో అమలు చేస్తున్నాం. ఇప్పటి వ రకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 94 మందికి పైగా పిల్లల ను, నారాయణపేట జిల్లాలో 40 మందిని పిల్లలను ప ట్టుకున్నాం. చదువుకునే వారిని గురుకుల రెసిడెన్షియల్‌ లో చేర్పిస్తున్నాం. ఎక్కడైనా పిల్లలను పనిలో పెట్టుకున్న ట్లు తెలిస్తే అక్కడికి వెళ్లి పిల్లలను అదుపులోకి తీసుకుం టాం. బాలల హక్కులను, ఆనందాన్ని చిదిమేసే సం స్థలు, వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు గు ర్తించిన బాలలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్‌నగర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిన్నారుల జీవితాల్లో స్మైల్‌
చిన్నారుల జీవితాల్లో స్మైల్‌
చిన్నారుల జీవితాల్లో స్మైల్‌

ట్రెండింగ్‌

Advertisement