e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home జోగులాంబ(గద్వాల్) చారకొండకు దళితబంధు నిధులు విడుదల

చారకొండకు దళితబంధు నిధులు విడుదల

  • 1200 కుటుంబాలు, 4 వేల మందికి లబ్ధి
  • నేటి నుంచి సర్వే.. వారంలోగా వివరాల సేకరణ
  • దళితుల హర్షం

నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 19 (నమస్తే తెలంగాణ) : దీపావళికి ముందే దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభు త్వం శుభవార్త ప్రకటించింది. దళితబంధుకు ఎంపికైన చారకొండ మండలానికి రూ.50 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పాలనలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే త ప్పా వారి అభివృద్ధిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో దళితులనను ఆర్థికంగా అ భివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు సీ ఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దేశ చరిత్ర లో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబం ధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం లో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వమే రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఉచితంగా అందజేయనున్నది. ఇలాంటి గొప్ప పథకానికి జిల్లాలోని చారకొండ మండలం ఎంపికైంది. గత సెప్టెంబర్‌ 2న ఈ పథకానికి ఎంపికైన మండలంలోని లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకుగానూ ప్ర భుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూ రు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మండలంతోపాటు జి ల్లాలోని దళిత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మండలంగా చారకొండ ఎంపిక కా వడం గమనార్హం.

ఈ మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1206 కుటుంబాలు ఉండగా 4,176 మందికిపైగా దళితులు ఉన్నారు. కాగా, ఈ సం ఖ్య 2 వేల కుటుంబాలకు చేరినట్లుగా ప్రాథమిక అంచనా. దీంతో ఇప్పటికే ప్ర భుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ మనూచౌదరి చారకొండలో అవగాహన సదస్సు నిర్వహించారు. దళితబంధు పథకం ఉద్దేశం, విధానాల గురించి దళితులకు వివరించా రు. ప్రతిపక్షాలు దళితబంధు పథకం అ మలుపై ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చే పడుతున్నాయి. ఈ పథకం పేరుకు మా త్రమే మిగులుతుందని దళితులు, ఇతర వర్గాల ప్రజల్లో సందేహాలు కల్పించే కు ట్రలకు తెరలేపాయి. దీన్ని కొట్టేసేలా సీ ఎం కేసీఆర్‌ రూ.50కోట్లు కేటాయించి ద ళితులపై తన ప్రేమను నిరూపించుకున్నా రు. దీంతో మండలంలోని దళితులు త మ బతుకులు బాగుపడతాయని సంబురపడుతున్నారు.

- Advertisement -

ఇప్పటికే సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సైతం నిర్వహించారు. జిల్లాలో మారుమూలన నల్లగొండ సరిహద్దు గ్రామమైన చారకొండ జిల్లాల ఆవిర్భావంతో 7 గ్రామాలతో మండలంగా మారింది. ఆ తర్వాత కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు 17 గ్రామాలతో సరిహద్దు మం డలంగా ఉంది. మారుమూల ప్రాంతం కావడంతో అభివృద్ధిలో కూడా ఆశించినంతగా దళితులు పురోగమించలేదు. ప్రస్తుతం దళితబంధు పథకం ద్వారా ద ళితులందరికీ రూ.10 లక్షల ఆర్థిక సా యం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ తయారు చేసింది. బుధవారం నుంచి అధికారులు మండలంలో ఇం టింటి సర్వే నిర్వహించనున్నారు. గ్రా మాల్లో ప్రతి దళిత కుటుంబం వివరాలు సేకరిస్తారు. ఇలా కుటుంబ సభ్యుల పే ర్లు, ఫొటోలు, చదువు, కులం సర్టిఫికెట్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డ్‌తో పాటుగా ఏదైనా వ్యాపారం చేయడంపై ఉన్న ఆసక్తిని సర్వే ద్వారా తెలుసుకొంటారు. వా రంలోగా సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఇక దళితబం ధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. దళితబంధు పథకానికి నిధుల మంజూరుతో దళితుల్లో హ ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వారంలో వివరాల సేకరణ..
దళితబంధు పథకం కింద ప్రభుత్వం చారకొండ మండలానికి రూ.50 కోట్లు కేటాయించడం సంతోషకరం. కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ ఆదేశానుసారం బుధవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. ప్రాథమిక అంచనా ప్రకారం మండలంలో 1206 కుటుంబాల్లో 4 వేలకుపైగా దళితులు ఉన్నారు. వారంలోగా సర్వే చేసి పూర్తి వివరాలు సేకరిస్తాం. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించడంతోపాటు దళితుల చదువులు, వ్యాపారాలపై ఉన్న ఆసక్తులను సర్వే ద్వారా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం.

  • రాంలాల్‌, సాంఘిక, సంక్షేమ శాఖ జిల్లా అధికారి, నాగర్‌కర్నూల్‌

బట్టల షాపు పెట్టుకుంటా..
కూలి పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. బట్టల వ్యాపారం చేయాలని నా కోరిక. కానీ డబ్బులు లేవు. సీఎం కేసీఆర్‌ సార్‌ రూ.10 లక్షలు ఇస్తే చారకొండలోనే బట్టల షాపు పెట్టుకుంటా. వ్యాపారంపై వచ్చే డబ్బులతో హాయిగా జీవించొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు. దళితబంధు పథకాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిని అందరూ కోరుకోవాలి. – కావలి లక్ష్మమ్మ, చారకొండ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement