e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021

చక చకా…

  • భారీ వర్షాలతో ఎడమ కాల్వకు గండ్లు
  • నర్సిరెడ్డి హైలెవల్‌ కాల్వకు మరమ్మతులు
  • దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
  • వారం రోజులుగా కెనాల్స్‌ వెంటే..
  • రెండ్రోజుల్లో నీటి విడుదల

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 20 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షాలతో మక్తల్‌ చెరువుకు వెళ్లాల్సిన వాగుకు వచ్చిన భారీ వరద కాస్త సంగంబండ నుంచి ఆత్మకూరుకు వెళ్లే కాలువలోకి మళ్లింది. కాలువ డిశ్చార్జి సామర్థ్యానికి మించి వరద పారింది. దీంతో కాలువకు ఐదు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. ఓ వైపు చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్‌ పూర్తి నీటి మట్టంతో కళకళలాడుతున్న కాలువకు గండ్లు పడిన తరుణంలో దిగువకు నీటిని వదిలే పరిస్థితి లేదు. గండ్లు పడిన త ర్వాత వరుసగా ఐదు రోజుల పాటు వర్షాలు కురవడంతో నష్టం అంచనా వేసేందుకు కూడా వీల్లే దు. కాలువలో నీరు ఉండడంతో వర్షం తగ్గిన త ర్వాత పనులు చేయడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. వారం రోజుల కిందట మరమ్మతులు చే పట్టారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఉదయం నుంచి రా త్రి వరకు కాలువల వెంటే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో నీటి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే కాలువల వెంట తిరుగుతూ గండ్లు పూడ్చే పనులు వేగంగా జరిగేలా చూడడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాలువకు ఐదు చోట్ల భారీ గండ్లు..
గత నెల 17వ తేదీన భారీ వర్షాలతో మక్తల్‌ చె రువుకు వెళ్లే వాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. హైలెవల్‌ ఎడమ కాలువపై నుంచి వరద వెళ్లేలా డిజైన్‌ చేసిన సూపర్‌ పాసెజ్‌ను కాదని కాలువలోకి ఆ వరద చేరింది. కాలువ సామర్థ్యం 350 క్యూసెక్కులు కాగా.. సుమారు 700 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో కాలువకు ఐదు చోట్ల గం డ్లు పడ్డాయి. మక్తల్‌ పట్టణానికి సమీపంలో సంగంబండ ప్రాజెక్టుకు 5 కి.మీ వద్ద భారీ గండి పడిం ది. 7వ కి.మీ వద్ద ఒకటో డిస్ట్రిబ్యూటరీకి, 8 కి.మీ దూరంలో గొల్లపల్లి వద్ద, 14 కి.మీ. దూరం లో మంతన్‌ గోడ్‌ వద్ద, 30 కి.మీ వద్ద నర్వ మండలం ఉందేకోడ్‌ వద్ద గండ్లు పడ్డాయి. గండ్ల ప్రభావంతో కాలువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే చిట్టెం అధికారుల సహకారంతో రంగంలోకి దిగారు. 5వ కి.మీ సమీపంలో సూపర్‌ పాసెజ్‌ వద్ద గండిని పూడ్చేందుకు జరుగుతున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సుమారు 2వేల టిప్పర్ల మట్టిని తరలించారు. హిటాచీలతో కాలువలో ఉన్న మట్టిని తొలగిస్తున్నారు. తెగిపోయిన కాలువ గట్టును తిరి గి ఏర్పాటు చేస్తున్నారు. 8వ కి.మీ. వద్ద గండిని పూడ్చేందుకు రోడ్డును ఏర్పాటు చేసుకొని టిప్పర్ల ద్వారా మట్టిని తరలించారు.

- Advertisement -

మరో రెండు రోజుల్లో నీటి విడుదల..
భీమా-1 ఎత్తిపోతల పథకంలో భాగంగా చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్‌ (3.317 టీఎంసీలు), భూత్పూర్‌ రిజర్వాయర్‌ (1.313 టీఎంసీలు) ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. సంగంబండ రిజర్వాయర్‌ పరిధిలో నాలుగు కాలువలున్నాయి. హైలెవల్‌ లెఫ్ట్‌ కాలువ, లో లెవల్‌ లెఫ్ట్‌ కెనాల్‌, హైలెవల్‌ రైట్‌ కెనా ల్‌, లో లెవల్‌ రైట్‌ కెనాల్‌ పరిధిలో 64,400 ఎకరాల ఆ యకట్టు ఉన్నది. భూత్పూర్‌ రిజర్వాయర్‌ కింద 46 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. సంగంబండ నుంచి ప్రధానంగా సాగునీటిని అందించే హైలెవల్‌ లెఫ్ట్‌ కెనాల్‌కు గండ్లు పడ్డాయి. సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ రిజర్వాయర్‌ నుంచి అమరచింత పట్టణం వరకు (సుమా రు 40 కి.మీ.) విస్తరించి ఉన్నది. నారు సిద్ధం చేసుకున్న రైతులు కాలువ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గండ్లు ప డిన చోట పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. అక్కడే అల్పాహారం, భోజనం చేస్తూ మరమ్మతు లు వేగంగా జరిగేలా చూశారు. దీంతో మక్తల్‌, మంతన్‌ గోడ్‌ వద్ద ప్రధానంగా గండ్లు పడిన వా టిని పూడ్చేశారు. మక్తల్‌ వద్ద ఎగువ నుంచి కాలువలోకి వరద రాకుండా చుట్టూ మట్టి పోసి గట్టి పరుస్తున్నారు. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రెండు రోజుల్లో నీటిని వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాగునీటి పారుదల శాఖ ఏ ఈఈ నాగశివ తెలిపారు.

సాగునీరు అందించడమే లక్ష్యం..
ఊహించని విధంగా కురిసిన వర్షాలతో అమరచింత వరకు సాగునీరందించే హైలెవల్‌ రైట్‌ కెనాల్‌కు భారీ గండి పడింది. అలాగే దిగువన కూడా మరో నాలుగు గండ్లు పడ్డాయి. దీంతో ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా రైతులకు సాగునీరిచ్చే పరిస్థితి లేదు. వర్షం నిలిచి, కాలువలో నీళ్లు తగ్గిన వెంటనే పనులు చేపట్టాం. వారం రోజులుగా కాలువల వెంటే మకాం వేసి టిప్పర్లు, హిటాచీ, రోలర్లతో పనులు చేశాం. రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. తర్వాత నీటిని వదులుతాం. కాలువకు గండ్లు పడేందుకు రైతులు కూడా కారణం అవ్వడం బాధాకరం. మోటర్లు వేసే క్రమంలో కాలువను తవ్వేస్తున్నారు. దీంతో వర్షపు నీరు కాలువల్లోకి మళ్లుతున్నాయి. సాగునీరు, విద్యుత్‌ శాఖ అధికారులు సమన్వయంతో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే మక్తల్‌

సంగంబండ పరిధిలో ఆయకట్టు వివరాలు..
హైలెవల్‌ రైట్‌ కెనాల్‌ : 250 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం, 18,400 ఎకరాల ఆయకట్టు (మాగనూరు, కృష్ణ మండలాలు), కాలువ పొడవు 24 కి.మీ.
లో లెవల్‌ రైట్‌ కెనాల్‌ : 100 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం, 10 వేల ఎకరాల ఆయకట్టు (మాగనూరు మండలం), కాలువ పొడవు 20.6 కి.మీ.
హైలెవల్‌ లెఫ్ట్‌ కెనాల్‌ : 350 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం, 30 వేల ఎకరాల ఆయకట్టు (మక్తల్‌, నర్వ, అమరచింత మండలాలు), కాలువ పొడవు 40.645 కి.మీ.
లో లెవల్‌ లెఫ్ట్‌ కెనాల్‌ 75 క్యూసెక్కులు డిశ్చార్జి సామర్థ్యం, 5,900 ఎకరాల ఆయకట్టు (మక్తల్‌, మాగనూరు మండలాలు), కాలువ పొడవు 15 కి.మీ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana