e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జోగులాంబ(గద్వాల్) గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

భూత్పూర్‌, జూలై 14 : గ్రామాల అ భివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పే ర్కొన్నారు. బుధవారం మండలంలోని పోతులమడుగు గ్రామంలో పీఎంజీఎస్‌వై పథకం ద్వారా మంజూరైన రూ.10 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి దేవరక ద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఎంపీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో గ్రామాలను ఎంతో అభివృ ద్ధి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధం గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.

ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చే స్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా లేవని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మన లాం టి రైతు సంక్షేమ పథకాలను కొనసాగించడం లేదన్నారు. గాడ చేయనోడు.. గీడ ఏం చేస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. ని యోజకవర్గంలో ఏడేండ్లలో 9 వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 1300 ఇండ్లను నిర్మించామని, కొత్తగా 1000 బడుల్‌బెడ్రూం ఇండ్లు మంజూ రు చేయనున్నట్లు తెలిపారు. పాతమొల్గరలో చెరువులో పడి మృతి చెందిన మ త్స్యకారుడు నర్సింహ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ రామకృష్ణ, ఎంపీపీ కదిరె శేఖర్‌రె డ్డి, చైర్మన్‌ సత్తూర్‌బస్వరాజ్‌గౌడ్‌, ఎంపీడీవో మున్ని, తాసిల్దార్‌ చెన్నకిష్టన్న, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహాగౌడ్‌, విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, వైస్‌ ఎం పీపీ నరేష్‌గౌడ్‌, ఏఈ అభిషేక్‌, సర్పంచు లు కమలమ్మ, వేణు, ఎంపీటీసీ ఊశన్న, మాజీ ఎంపీపీలు చంద్రశేఖర్‌గౌడ్‌, రా చూరిచంద్రమౌళి, నాయకులు సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్‌, నారాయణ, అశోక్‌గౌడ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం
గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం
గ్రామాల అభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement