e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జోగులాంబ(గద్వాల్) ఏటా రూ.5 కోట్లు

ఏటా రూ.5 కోట్లు

ఏటా రూ.5 కోట్లు
  • అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక అభివృద్ధి పరుగులు
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బడ్జెట్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • మంత్రి నిరంజన్‌డ్డి ఆమోదంతో అభివృద్ధి

నాగర్‌కర్నూల్‌, జూ లై 14 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ నియోజకవర్గాల్లో అ భివృద్ధి పరుగులు పెట్టనున్న ది. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పెం చడంతోపాటు వెచ్చించడంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నది. ఈ నిధులతో చేప ట్టే పనులను మంత్రి ఆమోదించనుండగా.. దీనికి సంబంధించి త్వర లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ను మరింత బలోపేతం చేసేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సదరు ప్రజాప్రతినిధులకు ఈ ఏడాది నుంచి అభివృద్ధి పనులకు నిధుల మం జూరు కొరత తీర్చనున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల చొ ప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్న ట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇటీవల అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యా యి. రెండేండ్లుగా నిధులు లేక ప్రజాప్రతినిధు లు అభివృద్ధి కోసం పడిన ఇక్కట్లు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈ ఏడాది నుంచి గ్రామాల్లో ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, కమ్యూనిటీహాళ్ల వంటి అభివృద్ధి ప నులకు నిధులు మంజూరు చేయనున్నారు.

ప్రస్తుతం సీఎం, ప్రభుత్వం నుంచి, ఆయా శాఖ ల మంత్రుల నుంచి తీసుకొస్తున్న నిధులతో మాత్రమే అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో అభివృద్ధి పనుల విషయంలో జాప్యం జ రుగుతున్నది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరుగా నిధులు కేటాయిస్తుండడంతో హా మీలు నెరవేర్చేందుకు మార్గం సుగమం కానున్నది. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 130 వరకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాది కి వచ్చే రూ.5 కోట్ల నిధులతో రానున్న మూడేండ్లలో ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రూ.15 కోట్ల చొప్పున అభివృద్ధి పనుల కోసం వెచ్చించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటా గతంలో ఉన్న రూ.3 కోట్లకు బదులుగా అదనంగా మరో రూ.2 కోట్ల చొప్పు న పెంచి నిధులు కేటాయిస్తుండడంతో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నలుగురు ఎ మ్మెల్యేలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాకు ప్రతి ఏడా ది రూ.35కోట్ల నిధులు మంజూరు కానున్నా యి. ఫలితంగా మూడేండ్లలో జిల్లాకు దాదాపు గా రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. కాగా, ఈ నిధులతో చేపట్టే ప నులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆమోదించేలా ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

అభివృద్ధి పనుల్లో వేగం..
నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడం ఆనందంగా ఉన్నది. ఈ నిధులతో గ్రామాల్లో ప్రజలు విన్నవించే సమస్యలను పరిష్కరించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నది. అలాగే ప్రాజెక్టులు, రోడ్ల కోసం రూ.కోట్లల్లో నిధులు మంజూరు చేస్తున్నది. వీటితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రామస్థాయిలోని సమస్యలను, అభివృద్ధిని వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

  • మర్రి జనార్దన్‌ రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌

త్వరలో మార్గదర్శకాలు..
నియోజకవర్గ అభివృద్ధికి ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌లో ఈ నిధులతో చేపట్టే పనుల కు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆమోదించాల్సి ఉంటుంది. త్వరలో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

  • భూపాల్‌రెడ్డి, జిల్లా ప్లానింగ్‌ అధికారి, నాగర్‌కర్నూల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏటా రూ.5 కోట్లు
ఏటా రూ.5 కోట్లు
ఏటా రూ.5 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement