e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జోగులాంబ(గద్వాల్) ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 30: పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో ఢిల్లీ- మాదిగల లొల్లి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జంబులయ్య, రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లేపోగు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోఎస్‌ భవనంలో మంగళవారం చలో ఢిల్లీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కాలే రమేశ్‌, జిల్లా కార్యదర్శి నరేశ్‌, మండల అధ్యక్షుడు కాలే యాదయ్య, రఘు, చెన్నయ్య, నర్సింహులు, జయన్న ఉన్నారు.

వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధిలేదు
ఎస్సీ వర్గీకరణ అమలు చేయడకుండ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదదర్శి బాలరాజు మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఆగస్టు 8,9న తలపెట్టిన చలో ఢిల్లీ పోస్టర్‌ను మంగళవారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పానుగంటి నాగేష్‌, నాయకులు పారుపల్లి వెంకటయ్య, బాల్‌రాజ్‌, అరుణ్‌కుమార్‌, సంతోష్‌, బాలకిష్టయ్య, బాలయ్య, వడెన్న, కుర్మయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

హన్వాడలో..
మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద చలో ఢిల్లీ గోడపత్రికను టీఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌, నాయకులు కలిసి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, నాయకులు అంజమ్మ, ఆంజనేయులు, రాములు, నర్సింహులు, ఎల్లమ్మ, భీమమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement