e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జోగులాంబ(గద్వాల్) అబల నేస్తం సఖి

అబల నేస్తం సఖి

అబల నేస్తం సఖి
  • హక్కులు, చట్టాలపై అవగాహన
  • లైంగిక, వరకట్న బాధితులకు ఆసరా
  • పోలీస్‌, వైద్య, న్యాయ సాయం
  • 181 హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం
  • బాధితుల జీవితాల్లో వెలుగులు

నాగర్‌కర్నూల్‌, జూలై 18 (నమస్తే తెలంగాణ) : సఖి కేంద్రాలు బాలికలు, మహిళలకు నేస్తాలుగా మారుతున్నాయి. విధి వంచితులైన బాధిత మహిళలకు అవసరమైన సాయం అందిస్తూ భావి జీవితం ఆనందంగా, కొంగొత్తగా ఉండేలా చేయూత అందిస్తున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంవల్ల వేలాది మంది బాలికలు, మహిళలు వివిధ సమస్యల నుంచి గట్టెక్కుతున్నారు. బాల్యవివాహాలతోపాటు లైంగిక వేధింపుల ఘటనల్లో బాలికలు, మహిళలు కుటుంబీకులకూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ఇంట్లో అత్తమామలు, భర్తల నుంచి వరకట్నం, గృహహింసల్లాంటి వేధింపులకు మహిళలు గురవుతున్నారు. వీటితోపాటు పలు రకాల సంఘటనల్లో విధి వంచితులుగా మారే బాలికలు, మహిళలకు సఖి కేంద్రాల ద్వారా అవసరమైన సహాయం అందుతున్నది. ఈ కేంద్రాలు 24గంటలపాటూ పని చేస్తున్నాయి. సమస్యలతో మహిళలు కేంద్రానికి వచ్చిన వెంటనే కనీస అవసరాలతోకూడిన వెల్‌కం కిట్‌ను అందిస్తారు. ఇక కేంద్రం సేవల్లో భాగంగా బాధితులకు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు.

అలాగే పోలీసుల సహాయం, న్యాయపరమైన సాయం, వైద్యచికిత్సలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో ఐదు రోజులపాటు బాధితులకు తాత్కాలిక వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం విశేషం. బాధిత మహిళల వివరాలను కేంద్రం అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఈ కేంద్రానికి ఓ వాహనం కూడా ఉంటుంది. ఎక్కడైనా సమస్య వస్తే నేరుగా వాహనంలో వెళ్లి అవసరమైన సాయం అందిస్తున్నారు. ముందుగా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. దీని ద్వారానే సమస్యను పరిష్కరించి సఖి కేంద్రం ద్వారా చేయూత అందించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ కేంద్రానికి వెళ్లలేని మహిళలు టోల్‌ఫ్రీ 181 ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా విస్తృత ప్రచారం చేపట్టారు. దీంతో బాధితులు ఫోన్‌ ద్వారా ఇంటి నుంచే సమస్యను వివరిస్తే అక్కడి నుంచి అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడించి పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకుంటారు. ఈ వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇలా సఖి కేంద్రం ద్వారా బాధితులకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌, పోలీసు, వైద్య సాయంతోపాటు తాత్కాలిక వసతి కూడాఅందిస్తూ నేనున్నా అనే భరోసా కల్పిస్తున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2019లో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 30వేల మందికిపైగా మహిళలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. అలాగే 564 కేసుల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషించింది.

- Advertisement -

సఖి కేంద్రంలో 24గంటలూ సేవలు
సఖి కేంద్రం 24గంటలూ అందుబాటులో ఉంటుంది. మహిళలు, బాలికలకు ఎలాంటి కష్టం వచ్చినా రావొచ్చు. 181టో ల్‌ఫ్రీ నెంబర్‌తోపాటు నాగర్‌ కర్నూల్‌ కార్యాలయంలోని 08540-298000, 9951940181నెంబర్లకు ఫోన్‌ చేసినా సహా యం అందించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 32వేల మందికి మ హిళల చట్టాలు, హక్కులతోపాటు సఖి కేంద్రం ద్వారా అం దించే సహాయం గురించి అవగాహన కల్పించాం.

  • సునీత, సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌, నాగర్‌కర్నూల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అబల నేస్తం సఖి
అబల నేస్తం సఖి
అబల నేస్తం సఖి

ట్రెండింగ్‌

Advertisement