e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ముసురుతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులు, కుంటల సమీపంలో నివసిం చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో శి థిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వాటిని తొలగించాలని సూచించారు. బలహీనంగా ఉన్న చెరువులు, కుం టలను గుర్తించి తెగిపోకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. చిట్యాల రోడ్డు, జెర్రిపోతుల వాగు, రామా టాకీసు వద్ద వంతెన పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు వర్షాకాలన్ని సాకుగా చూపితే అధికారులు రాజీపడొద్దన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

ఇబ్బందులు ఎ దురైతే కలెక్టర్‌ సలహా తీసుకోవాలని సూచించారు. వనపర్తి సమీపంలో మంజూరైన వంతెనలను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోకు సూ చించారు. ప్రజలు ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా మీద దృష్టి పెట్టాలని, పైపులైన్లకు లీకేజీలు లే కుండా చూడాలని స్పష్టం చేశారు. పారిశుధ్య సిబ్బంది రెయిన్‌కోట్లు, అవసరమైన పనిముట్లను సమకూర్చుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికా ప్ర కారం గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా 24న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 94 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. పోలీసుల సాయం తీసుకొని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు.

- Advertisement -

జిల్లాలో 11 వైకుంఠ ధామాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరు బాగుందని, ప్రభు త్వం వారి సేవలను గుర్తించి జీతాలు పెంచిందని పేర్కొన్నారు. కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్డెక్కితే రహదారులు దె బ్బతింటున్నాయని, పొలంలోకి వెళ్లాక వీల్స్‌ ఎక్కించుకోవాలన్నారు. రోడ్లపైకి వచ్చే కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్లకు పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానా విధించాల ని ఆదేశించారు. తన తరఫున ఎవరైనా ఫోన్‌ చేసినా విడిచిపెట్టొద్దన్నారు. రోడ్లు దెబ్బతింటే పంచాయతీరా జ్‌, రవాణ శాఖదే బాధ్యత అని హెచ్చరించారు. సమావేశంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వరా వు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, హెల్త్‌, అధికారులు పాల్గొన్నారు.

అమ్మ ప్రేమ వెలకట్టలేనిది : మంత్రి నిరంజన్‌రెడ్డి
అనుక్షణం బిడ్డ కోసం తపించే అమ్మప్రేమ వెలకట్టలేనిదని, అలాంటి అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బిడ్డలకు తీరనిలోటని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సింగిరెడ్డి తారకమ్మ రెండో వర్ధంతి సందర్భంగా పాన్‌గల్‌ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన తారకమ్మ, రాంరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశా రు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తన తల్లి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చై ర్మన్‌ శ్రీధర్‌, మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.

జ్ఞాపకాలకు పొదరిల్లు ఫొటోగ్రఫీ..
ఎన్నో స్మృతులకు, జ్ఞాపకాలకు పొదరిల్లు ఫొటోగ్రఫీ ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ మినీ ఫం క్షన్‌హాల్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ, సాలార్‌జంగ్‌ మ్యూజియం భారత ప్రభుత్వం, సిగ్మా అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ హైదరాబాద్‌, వనపర్తి పొటో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత ఫొటోగ్రఫీ శిక్షణా తరగతులు అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత ఫొటోగ్రాఫర్లకు, ఫొటో ఆర్టిస్టులుగా ఎదగడానికి ఇది మంచి అవకాశమన్నారు. ఈ రంగంలో వస్తున్న పె ను మార్పులకు మీలో ఉన్న ఆశయాలకు, ఆలోచనలకు చక్కటి వేదిక అని అన్నారు. ఈ రంగంలో పైకి ఎదగాల ని ఉన్న వారికి, ఆలోచనలకు పదును పెట్టే అవకాశం లభించిందన్నారు. అంతకుముందు శిక్షణా తరగతులను జనార్దన్‌, శేఖర్‌, భార్గవ్‌ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీపై ఎన్నో అంశాలను వివరించారు. కార్యక్రమంలో వనపర్తి ఫొటో అసోసియేషన్‌ సభ్యులు రమేశ్‌, వేణుగోపాల్‌, సుల్తాన్‌, రఫీ, ముంత శీను, రవీందర్‌, శీను, రాము, నాగరాజు, రాజు, సలీం, బాబా, కుమార్‌, రవి, బాలు, రామాంజ నేయులు, రమేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement