e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జోగులాంబ(గద్వాల్) అధికారుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి శూన్యం

అధికారుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి శూన్యం

  • ఆదాయం సమకూర్చుకునే విధంగా పనులు చేపట్టాలి
  • కఠిన నిర్ణయాలు తీసుకుంటే మున్సిపాలిటీలో అభివృద్ధి
  • శానిటైజేషన్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం
  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
  • మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలోఅధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

మక్తల్‌ టౌన్‌, జూలై 23 : అధికారుల నిర్లక్ష్యంతో మక్తల్‌ మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ సమకూర్చుకునే విధంగా పనులు ఉండాలన్నారు. మున్సిపాలిటీలోని వార్డులో తిరిగి సమస్యలను వివరించిన పనులు చేయడం లేదా అని కమిషనర్‌ను ఎమ్మెల్యే అడిగారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే విధంగా యాభై సెంటర్ల నిర్మాణం చేపట్టవొచ్చని, స్థలం చూయించామన్నారు.

మున్సిపాలిటీ లో అధిక సమస్యలు ఉన్న 9, 7వ వార్డుల్లో వెంటనే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మురుగు కాల్వలపై నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను అడిగారు. ప్రభుత్వ ప్రోగ్రామ్‌లను త్వరగా పూర్తి చేయాలన్నారు. అండర్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టకుండా సీసీ రోడ్డు నిర్మాణాలు వేయడం కుదరదన్నారు. కౌన్సిల్‌ సభ్యులను అడుగకుండా కమిషనర్‌ సొంత నిర్ణయాలు తీసుకుంటారని సభ్యులు ఆరోపణలు చేయగా అలా చేయకూడదని ఎమ్మెల్యే కమిషనర్‌కు సూచించారు. అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు.

- Advertisement -

ఈ నెల 30, 31న శానిటైజేషన్‌ కార్యక్రమం చేపడుదామని, అందుకు అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు వార్డుల స మస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేద్దామని తెలిపా రు. అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ అధికారులను విధుల గురించి వివరణ అడుగగా వారికి ఎ లాంటి అవగాహన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, అ ధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధం గా వార్డు కౌన్సిలర్లందరూ బాధ్యత తీసుకొని వారి వారి వార్డులను శానిటైజేషన్‌ చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. స్రాకో ఏజెన్సీని తొలగించి మున్సిపాలిటీ కి అప్పగించాలని కౌన్సిల్‌ సభ్యులు కోరారు. స్రాకో ఏజెన్సీని తొలగిస్తే పనులు నిర్వహించుకోగలరా అని ప్రశ్నించారు. ప్రతి కౌన్సిలర్‌ వారి వార్డుల్లో శ్రమదానం చే సుకోవాలన్నారు.

ఇప్పటి వరకు 10,586 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల, కౌన్సిలర్లు శ్వే త, జ్యోతి, రాధిక, అర్చన, మొగులప్ప, రాములు, సత్యనారాయణ, నర్సింహులు, కొండన్న, కో ఆప్షన్‌ సభ్యుడు శంషొద్దీన్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana