e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నెక్కొండ , చెన్నారావుపేట మండలాల్లో 151కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నెక్కొండ/ చెన్నారావుపేట, మే 26 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతుందని, పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అందజేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నెక్కొండ మండలంలో 111, చెన్నారావుపేట మండలంలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చెన్నారావుపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో చెన్నారావుపేట గ్రామానికి చెందిన ఇద్దరికి, అమీనాబాద్‌ 7, అక్కల్‌చెడ 3, జల్లి 3, కోనాపురం 8, లింగగిరి 4, లింగాపురం 2, పాపయ్యపేట 5, ఉప్పరపల్లి, ఎల్లాయిగూడెం గ్రామాల్లో ఒక్కొక్కరికి మొత్తం 40 మందికి రూ.40.046 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.

వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను ఆపడంలేదన్నారు. ఈ కార్యక్రమాల్లో నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్‌, స్థానిక తహసీల్దార్‌ పూల్‌సింగ్‌చౌహాన్‌, జడ్పీటీసీ బానోత్‌ పత్తినాయక్‌, ఎంపీపీ బాదావత్‌ విజేందర్‌, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్‌, సర్పంచ్‌ ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ బుర్రి తిరుపతి, సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ చింతకింది వంశి, నెక్కొండ ఎంపీపీ జాటోతు రమేశ్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, జడ్పీటీసీ సరోజన-హరికిషన్‌నాయ క్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, మార్క్‌ఫెడ్‌ మాజీ డైరెక్టర్‌ రాజిరెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ గుంటుక సోమయ్య, రైతు బం ధు సమితి జిల్లా సభ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ సారంగపాణి, నాయకులు కట్కూరి నరేందర్‌రెడ్డి, బక్కి కుమారస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement