e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు ధైర్యంగా కరోనాను జయించాలి

ధైర్యంగా కరోనాను జయించాలి

ధైర్యంగా కరోనాను జయించాలి

కొనసాగుతున్న ఇంటింటి సర్వే
అవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు

తొర్రూరు, మే 25 : కరోనా బాధితులను అదుకునేం దుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కౌన్సిలర్‌ తూర్పాటి సంగీత అన్నారు. మడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రామ సహాయం కృష్ణ కిశోర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కరోనా బాధితులకు మదర్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రామలింగం, మహంకాళి భూపతి, సతీశ్‌, శివ, విష్ణు, యాకన్న పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు.. బాధ్యత మరువొద్దు
నెల్లికుదురు : కరోనా బాధితులు అధైర్యపడొద్దు… అవ గాహన పెంచుకుని బాధ్యతగా మెలగాలని ఎంఈవో బాల రాజు అన్నారు. మండలంలోని పెద్దతండా, రాజుల కొత్తపల్లి గ్రామాల్లో ఎంపీడీవో బీ వేణుగోపాల్‌తో కలిసి మంగళవారం కరోనా బాధితుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి అవగాన కల్పించారు. ఎర్రబెల్లిగూడెంలో గ్రామ ప్రత్యేకాధికారి గుగులోత్‌ రాము ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్‌, సర్పంచ్‌లు అశోక్‌, రాజు, గ్రామ ప్రత్యేకాధికారి చారి అభిషేక్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జ్వర సర్వేతో కరోనా కట్టడి
నర్సింహులపేట: కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా తెలం గాణ ప్రభుత్వం ప్రారంభించిన జ్వర సర్వే మండలంలో కొనసాగుతోంది. రెండో విడుత జ్వర సర్వేలో భాగంగా మంగళవారం మండలంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరి స్తున్నారు. పెద్దనాగారం, పెద్ద నాగారం స్టేజీ, గోప తండా, అజ్మీరాతండా, గోల్‌బోడ్కతండా, నర్సింగాపురంలో జరుగుతున్న సర్వేను ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.
ధైర్యంగా ఎదుర్కోవాలి
పెద్దవంగర, మే 25 : కరోనాను ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, మండల ప్రత్యేకాధికారి రావూరి రాజు అన్నారు. మంగళవారం చిట్యాల గ్రామంలో బాలవికాస ఆధ్వర్యం లో వడ్డెకొత్తపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చారి టబు ల్‌ ట్రస్టు సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జ్వరం, దగ్గు, జలుబు వస్తే ఆరోగ్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇళ్లలో వస తులు లేని కరోనా బాధితులు ఐసొలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమావే శంలో ఎస్‌ఎఫ్‌సీ నిధుల ఆర్థిక ప్రణాళికను తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యోగేశ్వర్‌ రావు, ఎంపీడీవో శేషాద్రి, పీఆర్‌ ఏఈ యుగేంధర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ యాకూబ్‌పాషా, ఎంపీవో యాక య్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, బాలవికాస ప్రతినిధులు పాల్గొన్నారు.
మాస్క్‌ లేకపోతే ఫైన్‌ తప్పదు..
మరిపెడ : లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, విధిగా మాస్క్‌ ధరించాలని లేనిపక్షంలో జరిమాన తప్పదని జిల్లా ఉద్యాన అధికారి, మండల ప్రత్యేక అధికారి సూర్య నారాయణ హెచ్చరించారు. మండలంలోని ఎల్లంపేట, భూక్య తండా, మరిపెడ మునిసిపాలిటీ కేంద్రంలో ఆయన పర్యటించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సింగా రపు కుమార్‌, పూర్ణచందర్‌ పాల్గొన్నారు.
రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్‌ : సీఐ
నిర్ణీత సమయం తర్వాత రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్‌ చేస్తామని సీఐ సాగర్‌ హెచ్చరించారు. మునిసిపాలిటీ కేంద్రంలో మంగళవారం వరంగల్‌-ఖమ్మం, మహబూ బాబాద్‌-సూర్యాపేట జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి వాహన దారు లకు పలు సూచనలు చేశారు.
లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
చిన్నగూడూరు: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిం చాలని డీటీ, గ్రామ ప్రత్యేకాధికారి కోమల తెలిపారు. మండల కేంద్రంలోని కిరాణషాపులు, హోటళ్లు, చికెన్‌షాపుల వద్దకు వెళ్లి మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాస్కులు ధరించని, భౌతికదూరం పాటించని వారికి సరుకులు విక్రయించొద్దని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి అజీమ్‌, రెవెన్యూ సిబ్బంది ఉపేందర్‌ పాల్గొన్నారు.
కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు
కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మండల ప్రత్యేకాధికారి, అఫ్జల్‌ మోయిను ద్ద్దీన్‌, తహసీల్దార్‌ పుల్లా రావు అన్నారు. మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యా లయంలో సమీక్షించారు. అనంత రం మాట్లాడు తూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమిం చినట్లు తెలిపారు. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధ నలు పాటించేలా అవగాహన కల్పిం చా లన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో సరస్వతి, ఎస్సై విజయరామ్‌కుమార్‌, డీటీ కోమల, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధైర్యంగా కరోనాను జయించాలి

ట్రెండింగ్‌

Advertisement