e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు కరోనా వైరస్‌ నియంత్రణకు హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

కరోనా వైరస్‌ నియంత్రణకు హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

కరోనా వైరస్‌ నియంత్రణకు హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

నర్సంపేట రూరల్‌, మే 23 : ఆయా గ్రామాలు, తండాల్లో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావతి నేతృత్వంలో గ్రామంలో రసాయనాలను స్ప్రే చేయించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాల ని సూచించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాడ్గుల కవిత, కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని ఇటుకాలపల్లి, రాములునాయక్‌తండా, పర్శనాయక్‌తండా, గురిజాల గ్రామాల్లో జీపీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలంలోని కొత్తూరులో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ మేరకు సర్పంచ్‌ బూస రమ వార్డు సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో కరోనా ప్రబలకుండా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి కరోనా బారిన పడొద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు భిక్షపతి,బూస అశోక్‌ పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : మండలంలోని గిరిజన తండాలు, గ్రా మాల్లోని వీధుల్లో ఆదివారం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి, హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పిచికారీ చేయించారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించి అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని ప్రజాప్రతినిధులు, జీపీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించారు. భట్టు తండా-2 గ్రామంలోని వీధుల్లో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికాచీ చేసినట్లు సర్పంచ్‌ అమ్మి వీరన్న తెలిపారు. కరోనా నియం త్రణకు పరిశుభ్రత పాటించాలని కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా వైరస్‌ నియంత్రణకు హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

ట్రెండింగ్‌

Advertisement