e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు సిబ్బందిపై సీపీ స్పెషల్‌ కేర్‌

సిబ్బందిపై సీపీ స్పెషల్‌ కేర్‌

సిబ్బందిపై సీపీ స్పెషల్‌ కేర్‌

పోలీస్‌ కుటుంబాలకు ప్రత్యేకంగా ఐసొలేషన్‌ సెంటర్‌
ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్‌.. వ్యాక్సినేషన్‌
మాస్కులు, శానిటైజర్లు అందిస్తూ అప్రమత్తం

హన్మకొండ సిటీ, మే 20 : కరోనా కట్టడిలో పోలీసులు ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ఉంటున్నా రు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. కొవిడ్‌ కొందర్ని బలితీసుకుంటున్నా విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇలాంటి విపత్క ర పరిస్థితుల్లో సిబ్బంది ఆరోగ్యంపై పోలీస్‌ బాస్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. పోలీసులు కరో నా బారిన పడకుండా వరంగల్‌ పోలీస్‌ కమిషన ర్‌ తరుణ్‌జోషి ముందస్తు చర్యలు చేపడుతున్నా రు. కొవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలోని ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ జోన్ల ఏసీపీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజువారీగా మాట్లాడే సెట్‌ కాన్ఫరెన్స్‌లో సైతం ఇన్‌స్పెక్టర్లతో సిబ్బంది ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా లు వేసుకునేలా చొరవ చూపుతున్నారు.
ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రం
కరోనా సోకిన సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ఆర్‌ఈసీ సమీపంలోని పున్నమి గెస్ట్‌హౌస్‌లో సీపీ ప్రత్యేక చొరవతో వారం క్రితం ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయించా రు. అందులో బాధితులను నిత్యం పర్యవేక్షించేందుకు నిపుణులైన వైద్యులను అందుబాటు లో ఉంచారు. అవసరం ఉన్న వారికి ఆక్సిజన్‌తో పాటు భోజనం సౌకర్యం కల్పించారు. అత్యవస ర సమయంలో దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. ఐసొలేషన్‌లో బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు ఆరా తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఏసీపీ సత్యనారాయణను ప్రత్యేకంగా నియమించారు. దాదాపు 20 మంది సిబ్బంది ఈ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. రోడ్లపై రే యింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కరో నా బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భా గంగా శానిటైజర్లు, మాస్క్‌లు, షీల్డ్‌మాస్క్‌లు పంపిణీ చేశా రు. సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ సహకారాన్ని కోరుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిబ్బందిపై సీపీ స్పెషల్‌ కేర్‌

ట్రెండింగ్‌

Advertisement