e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు పచ్చని ఠాణా!

పచ్చని ఠాణా!

పచ్చని ఠాణా!

మామునూరు పోలీస్‌ స్టేషన్‌కు నయా లుక్‌
మొక్కల కుండీలు, పీఎస్‌కు రంగులు..
స్టేషన్‌కు వచ్చే వారి కోసం బెంచీలు ఏర్పాటు

కరీమాబాద్‌, మే8: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మామునూరు పోలీస్‌ స్టేషన్‌కు పచ్చని ఠాణాగా పేరుంది. విశాలమైన స్థలం.. అందులో ఏపుగా పెరిగిన చెట్లతో పార్కును తలపించేలా ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకుంది. సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులతో మామునూరు పోలీస్‌ స్టేషన్‌ కొత్త కళను సంతరించుకుంది. చెట్లకు వేసిన రంగులు.. స్టేషన్‌ ముందు ఏర్పాటు చేసిన పూల కుండీలు.. స్టేషన్‌ ప్రహరీకి వేసిన రంగులతో ఠాణాకు నయా లుక్‌ వచ్చింది.
అందంగా ముస్తాబు
పోలీస్‌ స్టేషన్‌ గోడకు వేసిన ఎరుపు రంగుతోపాటు ఆవరణలో పూల కుండీలను ఏర్పాటు చేశారు. పీఎస్‌ను పరిశుభ్రంగా మార్చి అందంగా తీర్చి దిద్దుతున్నారు. వివిధ గ్రామాల నుంచి పోలీస్‌ స్టేషన్‌కు పిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బెంచీలను సైతం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన వారు సేద తీరుతున్నారు.
ప్రజలతో మమేకం.
పోలీసులు ప్రజలతో మమేకమై పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఆన్‌లైన్‌ మోసాలు, కరోనా, నేరాల నియంత్రణ, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలతో చైతన్యం తెస్తున్నారు. అందుకోసం ఓ మైక్‌ సెట్‌ సైతం కొనుగోలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆర్‌ అండ్‌ బీ అధికారులతో కలసి రోడ్డుపై స్టుడ్స్‌, డ్రమ్ములు, లైన్స్‌ ఏర్పాటు చేశారు.
ప్రజలకు చేరువ కావాలని..

  • బీ రమేశ్‌, సీఐ, మామునూరు
    ప్రజలకు చేరువ కావాలని అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. ఉన్నతాధికారుల సహకారంతో స్టేషన్‌ లో పనులు చేస్తున్నాం. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కలిసికట్టుగా పని చేసి ప్రజల రక్షణకు పాటుపడుతాం.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పచ్చని ఠాణా!

ట్రెండింగ్‌

Advertisement