శంకర్.. మీ మాట కోసం ఆక్సిజన్ బ్యాంక్ పంపుతున్నా
ఫోన్లో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో మాట్లాడిన సినీనటుడు చిరంజీవి
మహబూబాబాద్, జూన్ 4 : మానుకోట నా అభిమాన కోట.. శంకర్ మీ మాట కోసం మహబూబాబాద్ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ పంపుతున్నానని ఫోన్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చెప్పారు. ‘ఎలా ఉన్నారు శంక ర్, కుటుంబ సభ్యులు బాగున్నారా..’ అని పలు కరించారు. దీనిపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ గతంలో మానుకోటకు ఆక్సిజన్‌ను పంపాలని చిరంజీవిని కోరానన్నారు. దీంతో శుక్రవారం ఫోన్ చేసిన చిరంజీవి మీ మాట ప్రకారం ఆక్సిజన్ బ్యాంక్‌ను పంపుతున్నానని తెలిపినట్లు విరించారు. అభిమానులే నాకు దేవుళ్లని వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాని వివరించినట్లు తెలిపారు.
ఆక్సిజన్ పంపిణీలో ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా చాలా చేయాల్సి ఉందని చిరంజీవి తెలిపినట్లు శంకర్‌నాయక్ చెప్పారు. తెలంగాణ ప్రదాత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో తన అభిమాన నటుడు చిరంజీవి సైతం తన నియోజకవర్గ, జిల్లా ప్రజలకు ఆక్సిజన్ బ్యాంక్‌ను పంపిస్తున్నట్లు తెలుపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆక్సిజన్ బ్యాంక్‌ని సోమవారం పెద్ద ఎత్తున ప్రారంభిస్తానని చిరంజీవికి తెలిపానని ఆయన వివరించారు. జిల్లా ప్రజల తరపున చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు శంకర్‌నాయక్ తెలిపారు.