ఇది స్మార్ట్ యుగం.. స్మార్ట్‌ఫోన్‌తోనే ఇప్పుడు చాలా పనులు చేసేయొచ్చు.. ఫ్యాన్లు, టీవీలు ఆన్ చేయడం నుంచి మొదలు పెడితే చాలా పనులను అరచేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో చేసేసే సదుపాయాలు వచ్చాయి. ఇప్పుడు మీ ఫోన్లో ఒక క్లిక్ చేయడం ద్వారా మీ ఇంటిని మంచి సువాసనభరితంగా మార్చేయొచ్చు. అదెలా అనుకుంటున్నారా.. గోద్రెజ్ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ స్మార్ట్ మాటిక్తో ఇది సాధ్యమవుతుంది. రూ.799కు ఇప్పుడు ఈ పరికరం మార్కెట్లో అందుబాటులో ఉంది.
పోర్టబుల్ సైజ్‌లో ఉండే ఈ రూం ఫ్రెష్నర్ పరికరాన్ని రూంలో ఎక్కడైనా పెట్టుకునే వీలుంటుంది. హాల్, కిచెన్, బాత్రూం ఇలా ఎక్కడైనా ఈ ఫ్రెష్‌నర్‌ను ఉంచుకోవచ్చు. ఈ ప్లేస్‌లను మన స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ కూడా చేసుకోవచ్చు. వాటికి పేర్లు పెట్టుకుని ఏ ప్లేసులో ఎంత సమయం స్ప్రే చేయాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు. 10 నుంచి 40 నిమిషాల వరకు స్ప్రే చేసేలా ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గోద్రెజ్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌లో లాగిన్ కావడం ద్వారా ఈ పరికరంతో కనెక్ట్ కావచ్చు. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎయిర్ స్మార్ట్ మ్యాటిక్‌ను మన ఫోన్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు.
ఈ ఎయిర్స్మార్ట్ మాటిక్లో ఫ్రెష్నర్ ఎప్పుడు అయిపోతుందోనన్న టెన్షన్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ మాటిక్లో ఎంత లిక్విడ్ ఉందో స్మార్ట్‌ఫోన్ యాప్‌లో నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది. ఈ లిక్విడ్ రీఫిల్ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. మార్కెట్లో ఒక్క లిక్విడ్ క్యాన్ ధర రూ.275గా ఉంది. ఒక్కో క్యాన్ 2200 స్ప్రేల వరకు పనిచేస్తుందని గోద్రెజ్ సంస్థ తెలిపింది. అయితే ఈ ఎయిర్ స్మార్ట్ మాటిక్లో ఒకే సమస్య ఉంది. అదేంటంటే.. దీని యాప్‌లో లాగిన్ అయినప్పుడు మన పర్సనల్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క ఆధార్ మినహా దాదాపు అన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటి మినహాయిస్తే ఈ స్మార్ట్ యుగంలో ఈ గోద్రెజ్ ఎయిర్ స్మార్ట్ మాటిక్ పరికరం మీ ఇంటిని రీఫ్రెష్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ గోద్రెజ్ ఎయిర్ స్మార్ట్ మాటిక్ పరికరం ఇంటిని రిఫ్రెష్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది