తట్ట అల్లి.. కష్టం తెలుసుకొని..

- ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే రాజయ్య
జఫర్‌గఢ్, ఫిబ్రవరి 22 : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య టీఆర్ఎస్ సభ్య త్వ నమోదులో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజల సంక్షే మం కోసం మెడికల్ ప్యాకేజీ ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా సో మవారం ఆయన జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు, కూనూరు, రఘునాథపల్లి, కోనాయిచలం, తిడుగు, సాగరం, జఫర్‌గఢ్, ఓబులాపూర్, తమ్మడపల్లి(జీ), సూరారం, తిమ్మాపూర్, హిమ్మత్‌నగర్, తీగారం, తిమ్మంపేట, తమ్మడపల్లి(ఐ) గ్రామాల్లో పర్యటించారు. పలువురికి టీఆర్ఎస్ సభ్యత్వాలను అందజేశారు. ఈ క్రమంలో సాగరం గ్రామంలో ఎరుకల కుల వృత్తిలో భాగంగా తట్ట అల్లుతున్న తిరుపతి ఎల్లమ్మను ఆప్యాయంగా పలకరించారు. ఆమె కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లమ్మ అల్లుతున్న తట్టను తీసుకుని ఎమ్మెల్యే స్వయంగా అల్లారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు పూర్తి చేసినట్లు తెలిపా రు. మార్చి 2న తన పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రిలో నియోజకవర్గ ప్రజలకు రాయితీలు ప్రకటించే కార్యాచరణను అమలు చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ రడపాక సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్‌రావు, వైస్ ఎం పీపీ కొడారి కనుకయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు నీరజారెడ్డి, మండల కో ఆర్డినేటర్ శంకర్, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఇన్చార్జి స్వామి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శివయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..