శనివారం 27 ఫిబ్రవరి 2021
Mahabubabad - Jan 26, 2021 , 00:40:30

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌ జనవరి 25 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని జంగిలికొండ, అమనగల్‌ గ్రామ పంచాయతీలోని నిర్మించిన  రైతువేదికలను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించుకునేందుకు ఈ రైతు వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ  ప్రియాంక, పీఏసీఎస్‌ చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ శ్రీను, వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ మురలి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటరెడ్డి, అశోక్‌ నాయక్‌, సురేందర్‌ నాయక్‌, కవిత రాంజీ నాయక్‌, సొసైటీ డైరక్టర్లు విజయసుధాకర్‌, ఉప్పలయ్య, సర్పంచ్‌లు సాయిలు, పూజారి మంగమ్మ, యాస రమ, నీలవేణి, ఎంపీటీసీ రాంచంద్రమ్మ, చంద్రూనాయక్‌, నాయకులు గోల్‌కొండ శ్రీనివాస్‌ రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు..

రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని ముడుపుగల్‌, అమనగల్‌, పర్వతగిరి పంచాయతీల్లో ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఇనుగుర్తి శ్యామ్‌కుమార్‌, బాలాజీ నాయక్‌, ఎంపీడీవో రవీందర్‌ పాల్గొన్నారు.    

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.. 

మహబూబాబాద్‌ : దివ్యాంగులకు అంగవైకల్యం జీవితంలో అవరోధం కాకూడదని, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ పైకెదగాలని  ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆకాంక్షించారు. బానోత్‌ సేవ్య నేతృత్వంలో వికలాంగులకు వీల్‌చైర్స్‌ అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై దివ్యాంగులకు వీల్‌చైర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌, ఫ్లోర్‌ లీడర్‌ చిట్యాల జనార్దన్‌, ఎం వెంకన్న, శంకర్‌, రాజు, మహేందర్‌ తదితరులు ఉన్నారు.  

VIDEOS

logo