గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

పెద్దవంగర, జనవరి 22: గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సర్పంచ్ చింతల భాస్కర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గంట్లకుంట పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడా రు. గ్రామ స్థాయిలో చేపట్టే పనుల్లో ప్రజల భాగస్వామ్యంతోనే అన్ని అంశాలతో ముడిపడి ఉంటాయన్నారు. హరితహారంలో నాటి మొక్కల సంరక్షణతో పాటు, పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు గ్రామంలో నిర్మాణం చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని పంచాయతీ కార్యవర్గం తీర్మానించింది. ఉపసర్పంచ్ ముక్తార్‌పాషా, వార్డు సభ్యులు అశోక్, సమ్మయ్య, మహే శ్, వినోద, పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.
ప్రజల సహకారంతో అభివృద్ధి సాధిస్తా..
గార్ల : ప్రజల సహకారంతో అభివృద్ధి సాధిస్తానని మేజర్ పంచాయతీ సర్పంచ్ బన్సీలాల్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాలక సభ్యుల ముఖ్య సమావేశంలో సర్పంచ్ ఇప్పటి వరకు చేసిన, ఇక ముందు చేయాల్సిన అభివృద్ధి పనులపై సభ్యులతో క్షేత్ర స్థాయిలో చర్చించారు. స్థానిక పాకా ఏరు వద్ద బతుకమ్మ ఘాట్ సందరీకరణ, జీవంజిపల్లి, పొన్నగంటి గండి, అంబేద్కర్ నగర్, పూమ్యాతండాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, అప్ప సముద్రం చెరువు సమీపంలోని శ్మశాన వాటిక వద్ద విద్యుత్ స్తంభాలు, గార్ల జీపీ పరిధిలో ఉన్న ఐరన్ పోల్స్ తొలగించి, సిమెంట్ స్తంభాలు, ప్రముఖుల విగ్రహాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని తీర్మానం చేశారు. ఉప సర్పంచ్ కందునూరి మహేశ్వరరావు, పాలక సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్‌కు యూసుఫ్ పఠాన్ గుడ్‌బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు