మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 23, 2021 , 00:40:47

మెట్ట పంటలకు అనువైన సమయమిది

 మెట్ట పంటలకు అనువైన సమయమిది

  • జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌   
  • ఆహార భద్రత పథకాన్ని వినియోగించుకోవాలి 

నెల్లికుదురు, జనవరి 22 : మెట్ట పంటలైన పెసర, మినుములు, నువ్వులు, కూరగాయల సాగు చేసేందుకు ప్రస్తూత సమయం అనువైనదని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) భూక్యా ఛత్రునాయక్‌ రైతులకు సూచించారు. మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చిన్నముప్పారంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా సర్పంచ్‌ చీకటి ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన రైతులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ మెట్ట పంటైన నువ్వులు ఈ పథకంలో సబ్సిడీ ద్వారా ఇవ్వనున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం కన్సెల్టెంట్‌ సారంగపాణి మాట్లాడుతూ వివిధ పంటల యాజమాన్య పద్ధ్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈ పథకం ద్వారా మంజూరైన కెమికల్స్‌ను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్‌రెడ్డి, పథకం టెక్నికల్‌ ఆపీసర్‌ స్వామినాయక్‌, ఎంపీటీసీ కదిర జగన్‌, సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఏఈవో ముజాహిద్‌ పాల్గొన్నారు.  

VIDEOS

logo