మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 23, 2021 , 00:40:47

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

  • జిల్లా అదనపు కలెక్టర్‌ అభినవ్‌ అభిలాష 

డోర్నకల్‌, జనవరి22 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అభినవ్‌ అభిలాష సూచించారు. శుక్రవారం మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, పట్టణ ప్రగతిపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్‌ యార్డు, తదితర అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు.  మొక్కలు చనిపోయిన చోట మళ్లీ  నాటేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఏఈ భిక్షపతి, వార్డు కౌన్సిలర్లు పీ జనార్దన్‌, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ అజిత్‌మియా తదితరులు ఉన్నారు.

VIDEOS

logo