శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mahabubabad - Jan 23, 2021 , 00:34:02

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా..

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా..

  • 16 మంది గాయాలు... ఇద్దరిని ఎంజీఎం దవాఖానకు తరలింపు

నెల్లికుదురు, జనవరి 22 : అదుపుతప్పి ట్రాక్టర్‌ పల్టీకొట్టడంతో 16 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈఘటన మండలంలో శుక్రవారం జరిగింది. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని బ్రా హ్మణకొత్తపల్లి గ్రామ శివారు ఆకేరువాగులో ఇసుక తీసేందుకు ట్రాక్టర్‌లో సుమారు 16 మంది కూలీలు వెళ్తున్నా రు. ఈ క్రమంలో గ్రామ శివారులో ట్రాక్టర్‌ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో బాధితులను మహబూబాబాబాద్‌ దవాఖానకు తరలించారు. వీరిలో పిడుగు యాకయ్య, తెప్ప శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం దవాఖానకు తరలించినట్లు తెలిపారు. బాధితుడి తండ్రి పిడుగు యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


VIDEOS

logo