మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 22, 2021 , 02:18:10

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

 ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

  • ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

కురవి, జనవరి 21 : ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను, డీఎస్‌ రవిచంద్రను టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట లాలయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉప సర్పంచ్‌ సంగెం భరత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బడ్జెట్‌లో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు వారి వారి సొంత స్థలాల్లోనే కట్టుకునే అవకాశం వస్తుందన్నారు. కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తనూ   కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఇచ్చిన ప్రతి మాట ఐదేళ్ల కాలంలో పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో డోర్నకల్‌ యువజన నాయకులు డీఎస్‌ రవిచంద్ర, ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి, మరిపెడ క్లస్టర్‌ ఆత్మ చైర్మన్‌, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బీ ఉమా, జిల్లా నాయకులు బీ పిచ్చిరెడ్డి, వీరభద్రస్వామి ఆలయ చైర్మన్‌ బీ రామునాయక్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ గుగులోత్‌ రవి, ఆర్‌బీఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ ముండ్ల రమేశ్‌, వైస్‌ ఎంపీపీ దొంగలి నర్సయ్య, ఆలయ మాజీ చైర్మన్‌ బీ రాజునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు దొడ్డ గోవర్థన్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, శ్రీదేవీ, నూతక్కి నర్సింహారావు, కే విజయ్‌, చిన్నం భాస్కర్‌, సంగెం భరత్‌, దైద భద్రయ్య, బీ వీరన్న, బీ వీరన్న, రమేశ్‌, రామచంద్రయ్య, ఈశ్వరీ, బోజు, వినోద్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామపార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

వ్యాక్సిన్‌పై ప్రజల్లో చైతన్యం తేవాలి ..

చిన్నగడూరు : కొవిడ్‌-19 వాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ వైద్య సిబ్బం దికి సూచించారు. మండలంలోని ఉగ్గంపల్లి పీహెచ్‌సీలో గురువారం  వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.  అనంతరం వైద్య సిబ్బందిని సన్మానించా రు.  ఎంపీపీ పద్మావెంకటరెడ్డి, జడ్పీటీసీ సునిత, తహసీల్దార్‌ పుల్లారావు, మండల ప్రత్యేకాధికారి సఫియొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంసింగ్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ మంగపతిరావు, డాక్టర్‌ రవికుమార్‌, వైస్‌ ఎంపీపీ వీరన్న, సర్పంచ్‌లు పూలమ్మ, మల్లయ్య, ఎంపీటీసీ ఉదయమ్మ మం డల ప్రధానకార్యదర్శి దారాసింగ్‌, నాయకులు కొమిరెల్లి, గంగరాజు తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo