సోమవారం 08 మార్చి 2021
Mahabubabad - Jan 21, 2021 , 01:53:45

‘భారతీయుల ఆకాంక్ష రామ మందిర నిర్మాణం’

‘భారతీయుల ఆకాంక్ష రామ మందిర నిర్మాణం’

గూడూరు/తొర్రూరు, జనవరి 20: భారతీయుల ఆకాంక్ష రామమందిర నిర్మాణమని మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధి సేకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. ప్రజలందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రూ.10 నుంచి తమ శక్తి కొద్ది నిధి అందించాలని కోరారు.  వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, తొర్రూరు ఖండ సంయోజక్‌ కొలుపుల శంకర్‌, సహ సంయోజక్‌ గుజరాతి శివకుమార్‌, జిల్లా బాధ్యులు పృథ్వీరాజ్‌, నాగరాజు, కౌన్సిలర్‌ జ్యోతి నాగరాజు, చలువాది సత్యనారాయణ, తోట శ్రీనివాస్‌, ఇమ్మడి రాంబాబు, దారం కుమారస్వామి, రమేశ్‌, దేవేందర్‌, నాగరాజు,  ఇంద్రకిరణ్‌రెడ్డి, సురేందర్‌, రుద్రదేవ్‌, ఉపేందర్‌, ప్రకాశ్‌, సాయి, తేజ, వంశీ, కుమారస్వామియాదవ్‌, రవిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

మరిపెడ: అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ మండల కేంద్రంలో రామ సేవకులు ర్యాలీ తీశారు. ఇక్కడ పాల బిందెల సోమయ్య, విష్ణువర్దన్‌, బాలకృష్ణ, గోపీకృష్ణ, శ్రీధర్‌, రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo