శనివారం 06 మార్చి 2021
Mahabubabad - Jan 19, 2021 , 00:53:22

‘రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా’

‘రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా’

బయ్యారం/ మరిపెడ/ గార్ల/ తొర్రూరు/ దంతాలపల్లి/ నెల్లికుదురు, జనవరి 16 : రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కరోనా నివారణ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా  అందించనున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ అందించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మరిపెడ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో కలిసి ప్రారంభించారు. మరిపెడ పీహెచ్‌సీ డాక్టర్‌ అరుణ టీకా వేసుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం, వైద్యులు పాల్గొన్నారు. డోర్నకల్‌ పీహెచ్‌సీలో 50 మంది వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా 48 మంది అంగన్‌వాడీ టీచర్స్‌, మెడికల్‌ సిబ్బంది హాజరై టీకాను వేయించుకున్నట్లు పీహెచ్‌సీలో వైద్యుడు రంజిత్‌రెడ్డి  తెలిపారు. గార్ల మండలం ముల్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల మెడికల్‌ ఆఫీసర్‌ బీవీ ప్రణవి మాట్లాడారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ముల్కనూరు పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని అన్నారు.  తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య పరిశీలించారు. టీకా వేయించుకున్న ఆరోగ్య సిబ్బందికి ఎనర్జీ డ్రింకులు, పండ్లు అందజేశారు. దంతాలపల్లి పీహెచ్‌సీ పరిధిలోని రెండు మండలాల్లో మొదటి దశలో 275 ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉండగా మొదటి రోజు 49 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు దంతాలపల్లి వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి బిందుశ్రీ తెలిపారు. నెల్లికుదురులో సోమవారం ప్రజాప్రతినిధులకు కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి మాట్లాడారు.అనంతరం మండల మెడికల్‌ ఆపీసర్‌ శ్రావణ్‌కుమార్‌ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

VIDEOS

logo