గురువారం 04 మార్చి 2021
Mahabubabad - Jan 18, 2021 , 05:22:24

కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచి

కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచి

  • టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు
  • బలపాల గ్రామంలో కల్యాణ మండప నిర్మాణానికి హామీ..

కురవి, జనవరి 17: సీఎం కేసీఆర్‌ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పే ర్కొన్నారు. మండలంలోని బలపాల గ్రామంలో ఎంపీ  మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌తో కలిసి దేవులపల్లి దేవయ్య నామకరణంతో నిర్మించిన రైతువేదికను ఆదివారం ప్రారంభించారు. ముందు గా స్థల దాత ప్రజానాయకుడు దేవులపల్లి దేవయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుట్టిన ఊరుకు వచ్చిన నామా నాగేశ్వర్‌రావుకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఊరు కన్నతల్లితో సమానమని, బలపాల గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు అన్ని హంగులతో బలపాల గ్రామంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన తండ్రి పేరు స్థిరస్థాయిగా నిలువాలనే ఉద్దేశంతో దేవులపల్లి దేవయ్య కు టుంబీకులు రైతు వేదికకు స్థలాన్ని దానం చేయడం సంతోషకరమన్నారు. అనంతరం దేవయ్య కుమారుడు డాక్టర్‌ కేశవరావును సన్మానించారు. ఉమ్మడి రాష్ట్రంలో వలస బాట పట్టిన ప్రజలు నేటి తెలంగాణ రాష్ట్రంలో పట్టణం నుంచి పల్లెలకు తిరుగు ప్రయాణం అయ్యారన్నారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర దేశంలో సాధించలేని ఎన్నో అద్భుతాలు ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్లలో చేసి చూపించిందని’ వివరించారు. 

రైతువేదికలతో నూతన వ్యవసాయం : ఎంపీ కవిత 

ప్రభుత్వం రూ.22లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికలతో నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టిందని ఎంపీ మాలోత్‌ కవిత పేర్కొన్నారు. మండలంలోని బలపాల, కాంపల్లి, తాళ్లసంకీస, మోద్గులగూడెం గ్రా మాల్లో రైతువేదికలతో పాటు అభివృద్ధి పనులను ఎమ్మె ల్యే రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.   

కేసీఆర్‌తోనే రైతులకు భరోసా : ఎమ్మెల్యే రెడ్యా 

సీఎం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా వచ్చిందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. కురవి మండలంలోని కాంపల్లి, తాళ్లసంకీస, బలపాల, మోద్గులగూడెం గ్రామాల్లో నిర్మించిన రైతువేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బలపాల రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన దేవులపల్లి దేవయ్య కుటుంబీకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ రవిచంద్ర, జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి, మహబూబాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బజ్జూరి ఉమా, ఆత్మ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, కోఆప్షన్‌ సభ్యుడు పాషా, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ ముండ్ల రమేశ్‌, వైస్‌ ఎంపీపీ దొంగలి నర్సయ్య, సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీదేవీ, టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్‌ గుగులోత్‌ రవి, వీరభద్రస్వామి ఆలయ చైర్మన్‌ బీ రామునాయక్‌, మాజీ చైర్మన్‌ రాజునాయక్‌, నర్సింహారావు, భద్రయ్య, వీర న్న, తుకారాం, రమేశ్‌,   బోజునాయక్‌, పెద్ది వెంకన్న, అనిల్‌, తోట రమేశ్‌, భిక్షమయ్య, రాంలాల్‌, వెంకటరమణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్‌, ఏవో మంజూఖాన్‌, ఎంపీడీవో ధన్‌సింగ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo