పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తా

- మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి
మహబూబాబాద్, జనవరి 17: పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్ తండాలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 2 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ భిక్షపతి, ఉడ్ల రమేశ్, సింగం వెంకన్న, సోమ్లానా యక్, బానోత్ రమేశ్, రాము పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సావిత్రీబాయి ఫూలే..
అట్టడుగు స్థాయి వర్గాల్లో విజ్ఞానాన్ని నింపిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయి ఫూలే అని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి కొనియాడారు. ఆదివారం పట్టణంలోని ముదిరాజ్ భవన్లో ఎస్సీ, ఎస్టీ మహిళా ఉపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ రామ్మోహన్, టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం హాజరయ్యారు. సావిత్రీ బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ఉపా ధ్యా యురాళ్లుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు