మంగళవారం 02 మార్చి 2021
Mahabubabad - Jan 17, 2021 , 01:24:53

వృద్ధుడి చేరదీత..

వృద్ధుడి చేరదీత..

మహబూబాబాద్‌, జనవరి 16 : పట్టణంలో కొంతకాలంగా తిరుగుతూ హోటళ్లు, ఇండ్లల్లో భిక్షాటన చేస్తూ స్థానిక టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురు మీ సేవ సెంటర్‌ సమీపంలోని తలదాచుకుంటున్న ఓ అనాథ వృద్ధుడిని ‘నమస్తే తెలంగాణ’ చొరవతో మండలంలోని సికింద్రాబాద్‌ తండా దైవకృప వృద్ధాశ్రమం నిర్వాహకుడు బానోత్‌ లోకేశ్‌ నాయ క్‌ చేర దీశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన బో యిని వెంకన్న (60), తన భార్య ఇటీవల అనా రోగ్యంతో మృతి చెందింది. నాటి నుంచి ఒంట రిగా తిరుగుతూ కొన్ని రోజులు క్రితం జిల్లా కేం ద్రానికి వచ్చి భిక్షాటన చేస్తున్న ఆయనను  ‘నమస్తే తెలంగాణ’ లోకేశ్‌కు సమాచారం అందిం చగా  శనివారం అనాథాశ్రమానికి తరలించారు.  రోడ్లపై ఎవరైనా అనాథగా కనిపిస్తే తనకు ఫోన్‌ నంబర్‌ 9440686627కు సమాచారం అందిస్తే వారిని ఆదరిస్తానని లోకేశ్‌ తెలిపారు.

VIDEOS

logo