బుధవారం 24 ఫిబ్రవరి 2021
Mahabubabad - Jan 17, 2021 , 01:24:53

వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి

వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి

  • టీకాపై అపోహలు వద్దు ఎంపీ మాలోత్‌ కవిత

మహబూబాబాద్‌ రూరల్‌ జనవరి 16 : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని,  ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఎంపీ మాలోత్‌ కవిత సూచించారు. శనివారం మండల పరిధిలోని కంబాలపల్లి పీహెచ్‌సీలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి  వ్యాక్సినేషను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. అ నంతరం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషితోనే రాష్ర్టానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిందన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు 28 రోజుల దాకా జాగ్రత్త వహిస్తూ పర్యవేక్షణలో ఉండాలన్నారు. కలెక్టర్‌ విపీ గౌతమ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సి నేషన్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. మొద టి విడుత వైద్య సిబ్బందికి, రెండో విడుత ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది, వారియర్స్‌కీ, ఆతర్వాత 50 ఏండ్లు దాడిన వృద్ధులకు, అనంతరం 18 నుంచి 50 ఏండ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. మొదటి, రెండో డోసు పడితేనే వ్యాక్సిన్‌ పూర్తిగా వేసుకున్నట్లని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి, ఎంపీపీ భూక్యా మౌనిక, జడ్పీటీసీ లునావత్‌ ప్రియాం క, సర్పంచ్‌ సందా వీరన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు నాయిని రంజిత్‌ కుమార్‌ తేళ్ల శ్రీను, జిల్లా వైద్యాధికారి ధనసిరి శ్రీరామ్‌, అంటు వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి సీతామహాలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాక్సిన్‌తో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది: ఎమ్మెల్యే

డోర్నకల్‌, జనవరి16 : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొవిడ్‌ వ్యాక్సిన్‌పై వైద్యులు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాక్సిన్‌ తయారు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కొమురయ్య,  మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, డిప్యూటీ డీఎంహెచ్‌వో అబ్రరీషా, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నున్నా రమణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, ఎం పీపీ ధరంసోత్‌ బాలు నాయక్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో కృష్ణ అర్జున్‌, హెచ్‌ ఈ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, డాక్టర్‌ విరాజిత, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌లాల్‌ మియా, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, వార్డు కౌన్సిలర్లు కాల సురేందర్‌ జైన్‌, పోటు జనార్దర్‌, అశోక్‌, శరత్‌, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ అజిత్‌ మి యా, రాంభద్రం, సర్పంచ్‌లు అంజయ్య, బోయినపల్లి వెంకన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు పీ రామనాథం, కొత్త రాంబాబు, కాల యశోధర్‌ జైన్‌, మధు, సలీమ్‌, నూకల ఉపేందర్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo