శనివారం 06 మార్చి 2021
Mahabubabad - Jan 16, 2021 , 01:48:50

టీఆర్‌ఎస్‌తోనే క్రీడాభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే క్రీడాభివృద్ధి

  • మంత్రి  సత్యవతిరాథోడ్‌

కురవి, జనవరి 15 : టీఆర్‌ఎస్‌తోనే క్రీడారంగం అభివృద్ధి సాధించిందని మంత్రి సత్యవతిరాథోడ్‌ పేర్కొన్నారు.  గోవింద్‌ రాథోడ్‌ స్మారకార్థం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం పెద్దతండా సర్పంచ్‌ వనజ శ్రీరాం అధ్యక్షతన నిర్వహించారు. ముం దుగా కబడ్డీ ఫైనల్‌ పోటీలను మంత్రి ప్రారంభించారు. క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు మంత్రి సత్యవతి రాథోడ్‌, జడ్పీచైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందుతో కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నిర్వహించే  పోటీలతో స్నేహబంధాలు పెంపొందుతాయని సూచించా రు.  జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కురవి, సీరోలు ఏకల వ్య గురకుల పాఠశాల, కళాశాలలో కోటి రూపాయల చొ ప్పున క్రీడా మైధానానికి నిధులు మంజూరు చేయించా మని తెలిపారు. కొవిడ్‌-19 ప్రజల్లో మార్పులను తీసుకువచ్చిందన్నారు. నేటి నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భయాందోళనలు అవసరం లేదన్నారు. జడ్పీచైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, గార్ల జడ్పీటీసీ ఝాన్సీ, మూల మధూకర్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, రవీందర్‌, వీవోపీ బానోత్‌ మల్సూర్‌, కిశోర్‌ వర్మ, గుగులోత్‌ శ్రీరాం, డేవిడ్‌, శంకర్‌, ఐలి నరహరి, గుగులోత్‌ నెహ్రూ, బీబీనాయక్‌తండా సర్పంచ్‌లు బోడ శ్రీనివాస్‌, జీవన్‌, అర్జున, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.   

VIDEOS

logo