కొవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి

- అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్
తొర్రూరు, జనవరి15: ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ అధికారులకు సూచించారు. తొర్రూరు పీహెచ్సీలో శనివారం ప్రారంభించనున్న కరోనా వ్యాక్సి నేషన్ కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీ లించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ఎక్కడా ఇబ్బంధులు తలెత్తకుండా అధికారులకు అన్ని సూచన లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తొలుత 30 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్నామని ఈ దవాఖాన పరిధిలో 573 మంది ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, సోమవారం నుంచి రోజుకు వంద మంది చొప్పున టీకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి గుండాల మురళి, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం, మున్సిపల్ చైర్మన్ రాంచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైద్యాధికారి దిలీప్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ వీపీ గౌత మ్ ప్రారంభిస్తారని వారు తెలిపారు.
డోర్నకల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వాక్సిన్ ఏర్పాట్లను ఆర్డీవో కొమురయ్య శుక్రవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్, అధికారులతో మాట్లాడుతూ శనివారం నిర్వహించే కొవిడ్ వ్యాక్సిన్ ప్రా రంభోత్సవంలో 30 మంది మెడికల్, అంగన్వాడీ సి బ్బందికి వాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కొవిడ్ వాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, మండల ప్రత్యేక అధికారి మురళీ రమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో అబ్రరీషా, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డాక్టర్ రంజిత్ రెడ్డి, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్సై వాంకుడోత్ భద్రునాయక్, డాక్టర్ వీరాజిత, ఏపీవో మున్వర్ బేగ్, సీహెచ్‌వో వీరాబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.