బుధవారం 27 జనవరి 2021
Mahabubabad - Jan 14, 2021 , 01:25:27

ఘనంగా గోదారంగనాథుల కల్యాణం

ఘనంగా గోదారంగనాథుల కల్యాణం

  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
  • మొక్కులు చెల్లించుకున్న భక్తులు

తొర్రూరు, జనవరి 13 : ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాంగంగా సంక్రాతి పర్వదినాన్ని పురస్కరించుకొని డివిజన్‌ కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో, వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మాపురం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం శ్రీగోదారంగనాథుల కల్యాణోత్సవాన్ని పండితులు కనుల పండువలా నిర్వహించారు. తొర్రూరులో మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ దొంగరి రేవతిశంకర్‌, సునితాజైసింగ్‌, మాధవి అనిల్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరిపిరాల వేడుకల్లో చైర్మన్‌ రావుల సుభాశ్‌రెడ్డి, సర్పంచ్‌ ఆర్‌ మమత జగదీశ్‌రెడ్డి, ఎంపీటీసీ వీ గోపమ్మ మల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.   

పెద్దవంగర: మండలంలోని చిట్యాల గ్రా మంలోని సీతారామ ఆలయంలో నెల రోజుల నుంచి శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల ముగింపు  బుధవారం గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవాన్ని ఆలయ ఆర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 నర్సింహులపేట : మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిపెడ: మున్సిపల్‌ కేంద్రంలోని రాములోరి ఆలయంలో, మండలంలోని ఎడ్జర్ల రామాలయంలో గోదాదేవి-రంగనాధుల కల్యాణం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కో ఆఫ్షన్‌ మెంబర్‌ ఉప్పల నాగేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్‌ గంట్లా రంగారెడ్డి, వేద పండితులు వెంకటశ్రీమ న్నారాయణచార్యులు తదితరులు పాల్గొన్నారు.

నెల్లికుదురు : మండలంలోని మధనతుర్తి లో శ్రీ కోదంరా మాలయంలో బుధవారం మాజీ సర్పంచ్‌ వలబోజు వెంకటేశ్వరు-సులోచన దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణ వైభవంగా నిర్వహించారు. సర్పంచ్‌ కొమ్ము అనిల్‌, మంగి మల్లయ్య, బియ్యాల నళినిదేవి, సోమేశ్వర్‌రావు పాల్గొన్నారు.

కురవి: మండలంలోని రాజోలు గ్రామం లో శ్రీదేవీ, భూదేవీ సమేత వరదరాజస్వామి ఆలయంలో గోదారంగనాథస్వామి కల్యాణం అశేష భక్తుల నడుమ వైభవోపేతంగా వేదపండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బజ్జూరి ఉమా, ఎంపీపీ గు గులోత్‌ పద్మావతి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ షేక్‌ మస్తాన్‌, ఉపసర్పంచ్‌ అనూష విష్ణు, అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కలకోట రాము, నాలం శ్రీను, పోచారపు ఉప్పలయ్య, బందెల వెంకట్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 

గార్ల: స్థానిక లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు సమ క్షంలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ కవి, రచయిత బూడిద అరుణ్‌ గౌడ్‌ చిన్న అల్లుడు రాంపల్లి రాజేశ్‌ గౌడ్‌ ఆది గౌరి అమ్మకు భక్తి శ్రద్ధ్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అరుణ్‌ గౌడ్‌ ఉన్నారు.


logo