నీళ్లు నిండుగా.. సాగు సంబురంగా..

- సమృద్ధిగా వర్షాలు
- నిండుకుండలా చెరువులు, కుంటలు
- యాసంగి సాగుకు సన్నద్ధమైన రైతు
దంతాలపల్లి, జనవరి 12 : జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా కురిసిన వర్షాలు. దీంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో విస్తారంగా అడవుల విస్తీర్ణం పెరిగింది. దీంతో జిల్లాలో వర్షపాతం పెరిగింది. ఏటా మే నెలలో భూగర్భ జలాలు అడుగంటేవి. దీంతో ప్రజలు సాగుకు వెనుకాడేది. దీనికితోడు తాగునీటికీ కష్టమయ్యేది. కానీ, కొన్ని సంవత్సరాలుగా వర్షపాతం ఎక్కువగా నమోదవడంతో భూగర్భజలాలు పెరిగాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీనికి తోడు మండలంలో అన్ని గ్రామాల చెరువులు, కుంటలను నింపేందుకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేయడంతో భూగర్భ జలాలు పెరిగాయి. పుష్కలంగా నీరు, ఉచిత విద్యుత్ తో రైతన్నలు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
తాజావార్తలు
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
- ఎఫ్బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు
- రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు