నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి

తొర్రూరు, జనవరి 13: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. అఖిల భారత రైతు సం ఘాల పోరాట సమన్వయ సమితి (ఏఐసీసీ) పిలుపులో భాగంగా బుధవారం నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నాంచారిమడూర్, కంఠాయపాలెం, అమ్మాపురంలో సాగు చట్టాలను దగ్ధం చేశామన్నారు. ఈనెల 18వ తేదీన మహిళా రైతుల నిరసన, 23న నేతాజీ సుభాశ్చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా రైతాం గం ఆందోళన, 26న ట్రాక్టర్ల తో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో వామపక్ష రైతు సంఘాల నాయకులు కొత్తపల్లి రవి, ముంజంపల్లి వీరన్న, ఎండీ యా కూబ్, గట్టు శ్రీమన్నారాయణ, వెంకట్రెడ్డి, సోమిరెడ్డి, లక్ష్మణ్, వెంకటనారాయణ, శ్రీనివాస్, షరీఫ్, వీరన్న, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు, జనవరి 13 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నూ డెమోక్రసీ డివిజన్ నాయకులు ఇరుగు అనిల్ కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని బంజరా గ్రామంలో సం బంధిత ప్రతులను బోగి మంటల్లో వేసి దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26వ తేదీన చేపట్టే ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నరేశ్, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
గార్ల: రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా నాయకులు కందనూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఎం, రైతు సం ఘాల నాయకులు కవిత, అంబ టి వీరస్వామి, ఈశ్వర్లింగం, వి వెంకటేశ్వర్లు, మహేశ్వరరావు, బి హరి, వి కొండ య్య, గోవింద్, శ్రీను, సురేష్, శంకర్, అశ్వంత్ సంగు, రోజా పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖాళీ కడుపుతో 'ఉసిరి' తినవచ్చా?
- నిఖిల్ బర్త్డే.. రైడర్ టీజర్ విడుదల
- మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్
- కోహ్లి వద్దు.. రహానేకే కెప్టెన్సీ ఇవ్వండి!
- జార్ఖండ్లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!
- పది పెళ్లిళ్లు.. సంతానం కలగలేదు.. చివరకు ఇలా..
- డ్రైవర్ల నిర్లక్ష్యంతో బలవుతున్న అమాయకులు: మంత్రి జగదీష్ రెడ్డి
- ఆ దేశంలో మళ్లీ పెరిగిన ఆత్మహత్యలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల