సోమవారం 01 మార్చి 2021
Mahabubabad - Jan 13, 2021 , 00:30:52

పేదింటి ఆడబిడ్డకు వరం కల్యాణలక్ష్మి

పేదింటి ఆడబిడ్డకు వరం కల్యాణలక్ష్మి

  • ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీచైర్‌పర్సన్‌ బిందు
  • లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

బయ్యారం, జనవరి12 : కల్యాణలక్ష్మి  పెదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే బాణోత్‌ హరిప్రియా నాయక్‌,  జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని  కొందడరామ స్వామి ఫంక్ష న్‌ హాల్‌లో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌ పర్సన్‌  పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధం గా పెదింటి ఆడబిడ్డకు మేనమామ కట్నంగా రూ. లక్షా నూట పదహార్లు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ మౌనిక, వైస్‌ ఎంపీపీ తాతా గణేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మూల మధూకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ తరంగిణి, ఎంపీటీసీలు శైలెజా కుమారి, ఉపేంద్ర, సర్పంచ్‌ కోటమ్మ, మండల అధ్యక్షుడు ఆర్‌ బుచ్చి రెడ్డి, నాయకులు సత్యనా రాయణ, ప్రభాకర్‌ రెడ్డి, సొమిరెడ్డి, తదితరులున్నారు.

గార్ల, జనవరి 12: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి వర మని ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ బిం దు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 47 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. లక్షా 116 చొప్పున మంజూరు చేసిన, యాబై రెండు వేల నాలుగు వందల యాబై రెండు రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధ్దిదారులకు ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ పంపిణీ చేశారు.  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పీ రాధాకృష్ణ, ఎంపీపీ ఎం శివాజీ, జడ్పీటీసీ జే ఝాన్సీలక్ష్మి, సొసైటీ చైర్మన్‌ వీ దుర్గాప్రసాద్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తహసీల్దార్‌ రఫియుద్దీన్‌, ఎంపీడీవో రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo